Thandel Day 24 Collections : ‘తండేల్’ 24వ రోజు కలెక్షన్లు.. స్టడీగా వసూల్ చేస్తున్న చైతూ!
నాగ చైతన్య - సాయిపల్లవి జంటగా నటించి చిత్రం 'తండేల్'. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ప్యూర్ లవ్, అదిరిపోయే యాక్షన్, దేశభక్తిని చూపించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ఇక మూడు వారాలుగా అక్కినేని నాగచైతన్య 'తండేల్' చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు ఆసక్తికరంగా ఉన్నాయి. కాస్తా స్టడీగా వసూళ్లు రాబట్టి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. డే19 వరకే ఈ చిత్రం రూ.106కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిందని 'డ్రాగన్' యూనిట్ ప్రత్యేకంగా ప్రకటించింది.
'తండేల్' మొదటి వారం వసూళ్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద రూ.కోటీ నుంచి రూ.3 కోట్ల వరకు తగ్గకుండా వసూళ్లు రాబట్టింది. మొదటి రెండు వారాలు మాత్రం జోరుగానే కలెక్షన్లు అందుకుందీ చిత్రం. కానీ థర్డ్ వీక్ లో డీలా పడింది. రోజుకు రూ.50 లక్షల వరకే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం మూడు వారాలు కంప్లీట్ చేసుకుంది. నాలుగో వారం కూడా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. పావు కోటీ వరకు వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద 'తండేల్' మనుగడ సాధిస్తోంది.

తొలిరోజే 'తండేల్' రూ.21కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. డే1న రూ.11.5 కోట్ల నెట్ వసూల్ అందుకుంది. ఇక రెండో రోజు రూ.12.1 కోట్ల వరకు ఇండియాలో నెట్ వసూల్ చేసింది. డే3న రూ.12.7 కోట్లు రాబట్ట గలిగింది. అలా మొదటి మూడు రోజులు మాత్రం రూ.పది కోట్లకు పైగా నెట్ వసూళ్లు చేసి అదరగొట్టింది. ప్రస్తుతం నాలుగులో వారంలో వసూళ్లను అందుకుంటోంది. ఫోర్త్ వీక్ లోనూ 'తండేల్' స్టడీగానే కలెక్షన్లు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
డే23న ఈ చిచిత్రానికి రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇక డే24న సెకండ్ ఆదివారం రూ.25 లక్షల వరకు కలెక్షన్లు అందుకుంది. ఇక నేటి కలెక్షన్లు ఎలా ఉంటాయనేది చూడాలి. త్వరలో ఓటీటీలోకి రానున్న ఈ చిత్రం సాధ్యమైనంత వరకు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు చేసుకుంటోంది. ఇక 'తండేల్' ఫస్ట్ వీక్ లో రూ.49.4 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్ల నెట్ అందుకుంది. సెకండ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.11.3 కోట్ల నెట్ వచ్చింది. తెలుగు స్టేట్స్ లో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ రాబట్టింది.
థర్డ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.4.35 కోట్ల నెట్ అందింది. తెలుగులో రూ.4.34 కోట్ల నెట్, హిందీలో రూ.లక్ష వసూలైంది. ఇక ఫోర్త్ వీక్ ఎంత వసూల్ చేస్తుందనేది చూడాలి. 'డ్రాగన్', 'జాబిలమ్మ నీకు అంత కోపమా', 'మజాకా' వంటి చిత్రాలు పోటీలో ఉన్నా ఇంకా తండేల్ వసూళ్లు రాబడుతుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేసిన విషయం విధితమే. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పించారు. బన్నీ వాసు నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











