Thandel Day 10 Collections: బాక్సాఫీస్ పై ‘తండేల్’ యుద్ధం.. పదోరోజు కలెక్షన్ల సునామీ!
'తండేల్' బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫామ్ చేస్తోంది. అక్కినేని నాగచైతన్యకు ఆయన కెరీర్ లోనే రూ.100 కోట్ల సినిమాగా ఈ చిత్రం నిలిచింది. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. శ్రీకాకుళం రాజు పాత్రలో చైతూ, సత్య పాత్రలో మెగా పవర్ స్టార్ సాయిపల్లవి జీవించారు. ప్యూర్ లవ్ స్టోరీని వెండితెరపై పండించడంతో సినిమాకు ఆడియెన్స్ నుంచి మరింతగా మౌత్ పబ్లిసిటీ పెరిగింది. సంక్రాంతికి వచ్చిన విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తప్పా 'తండేల్' చిత్రానికి పెద్దగా పోటీ ఏదీ రాలేదు. చిన్న సినిమాల్లో 'తండేల్' కు వస్తున్న రెస్పాన్స్ సూపర్ అనే చెప్పాలి. తొలిరోజే ఈ చిత్రం రూ.21 కోట్లు వసూళ్లు చేయడం విశేషం.
ఇక.. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నిన్నటితో 10వ రోజు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ మంచిగా పెర్ఫామ్ చేస్తోంది. తొమ్మిది రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మీడియం బడ్జెట్ చిత్రాల్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. డే1 నుంచి డే9 వరకు తండేల్ స్టడీగా వసూళ్లు రాబడుతూనే ఉంది. తొమ్మిదో రోజు ఈ చిత్రం రూ.2.4 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగు స్టేట్స్ లో 2.39 కోట్లు, తమిళంలో రూ.0.01కోట్లు వసూల్ చేసింది. ఇక పదోరోజు రెండో ఆదివారం ముందు రోజు కంటే జోరుగా వసూళ్లు జరిగింది.

తండేల్ డే10న మొత్తంగా రూ.3.25 కోట్ల నెట్ వసూల్ చేసినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇంకా స్పష్టమైన లెక్కలు వస్తే రూ.4 కోట్ల వరకు నెట్ వసూల్ చేసి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పదో రోజు రూ.4.5 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. తెలుగు స్టేల్స్ లోనే ప్రస్తుతం ఈ చిత్రం బాగా పెర్ఫామ్ చేస్తోంది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ఆంధ్రాలో రూ.16కోట్లు, నైజాంలో రూ.11 కోట్లు, కర్ణాటకలో రూ.3 కోట్లు, హిందీ రైట్స్ ను రూ.10 కోట్లకు కొనుగోలు చేశారు. ఓవర్సీస్ రైట్స్ రూ.12కోట్ల వరకు అమ్ముడుపోయింది.
తండేల్ చిత్రాన్ని రూ.75 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రానికి.. రూ.105 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయ్యింది. 54 కోట్ల షేర్ వసూల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రూ.100 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందీ చిత్రం. రూ.57.19 కోట్ల నెట్ వసూల్ చేసింది. సెకండ్ వీక్ ఇలాగే పెర్ఫామ్ చేస్తే మాత్రం లాభాల బాటలో దూసుకుపోతుంది. ఇక అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించి ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











