Thandel Day 11 Collections : సెకండ్ వీక్ లోనూ ‘తండేల్’ తడాఖా.. 11వ రోజు కలెక్షన్ ఎంతంటే?
అక్కినేని నాగచైతన్య 'తండేల్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటి వారం ఈ చిత్రం బాగా పెర్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద 'తండేల్' అదే స్థాయిలో వసూళ్లు చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిందని నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రూ.105 కోట్లు గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.54 కోట్ల షేర్ ను వసూల్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం తండేల్ మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. స్టడీగా వసూళ్లు రాబుతోంది.
తొలిరోజు ఈ చిత్రం రూ.21 కోట్లను సాధించి మంచి ఓపెనింగ్ డేతో బాక్సాఫీస్ వద్ద ఖాతా తెరిచింది. రెండో రోజూ ఏకంగా రూ.41 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. తొలి రెండు రోజుల తర్వాత కాస్తా తగ్గినా.. స్డడీగా మాత్రం వసూళ్తు చేస్తూనే వస్తోంది. వర్కింగ్ డేస్ లో రూ.2 కోట్లపై పైగానే రాబడుతోంది. వీక్ డేస్ లో రూ.3 నుంచి 4 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తూ ఆశ్చపరుస్తోంది. మొదటి వారం తండేల్ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ బాగానే ఉంది.

ఇక సెకండ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం రెండో వారంలోనూ మంచిగానే వసూళ్లు చేస్తోంది. డే9న 2.4 కోట్ల నెట్ వసూల్ చేసి రూ.100 కోట్ల గ్రాస్ కు చేరుకొని వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. దీంతో నాగచైతన్యకు తన కెరీర్ లో ఉత్తమ చిత్రంగా 'తండేల్' నిలిచింది. ఇక డే10న రూ.3.10 కోట్ల కలెక్షన్స్ తో దుమ్ములేపింది. ఈ క్రమంలో డే11వ రోజు కలెక్షన్స్ ఏ మాదిరిగా ఉన్నాయో తెలుసుకుందాం.
డే11 సోమవారం వర్కింగ్ డే కావడంతో తండేల్ కలెక్షన్స్ కు కాస్తా గండి పడింది. అయినా.. కూడా పదకొండవ రోజు రూ.1 కోటికి పైగా నెట్ వసూల్ చేసింది. అంటే ఈ సినిమాకు ఆడియెన్స్ ఎంతలా అట్రాక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో 'తండేల్' వరల్డ్ వైడ్ మొత్తం రూ.58.05 కోట్ల నెట్ ను వసూల్ చేసింది.
ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ఆంధ్రాలో రూ.16కోట్లు, నైజాంలో రూ.11 కోట్లు, కర్ణాటకలో రూ.3 కోట్లు, హిందీ రైట్స్ ను రూ.10 కోట్లకు కొనుగోలు చేశారు. ఓవర్సీస్ రైట్స్ రూ.12కోట్ల వరకు అమ్ముడుపోయింది.

తండేల్ ను టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు రూ.75 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించి ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తిని చూపించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.


Click it and Unblock the Notifications











