Thandel Day 12 Collections : ‘తండేల్’ 12వ రోజు కలెక్షన్స్.. సెకండ్ వీక్ లో ఇలా సెట్ అయిన చైతూ!
నాగచైతన్య 'తండేల్' బాక్సాఫీస్ కలెక్షన్లు సెకండ్ వీక్ లోనూ అదిరిపోతున్నాయి. మరీ ఓ రేంజ్ లో కాకుండా స్టడీగానే వసూళ్లు చేస్తోంది. డే12న కూడా 'తండేల్' తనకు రావాల్సిన వసూళ్లను రాబడుతూనే ఉంటోంది. బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు దిగుతున్నా.. తండేల్ మాత్రం పక్కకు జరగనంటూ థియేట్రికల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మొదటి వారం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫామ్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద 'తండేల్' ఓ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది.
డే1న 'తండేల్'కు రూ.21 కోట్ల గ్రాస్ వసూలవ్వగా, డే2, డే3, నాలుగో రోజు కూడా మంచిగానే పెర్ఫామ్ చేసింది. తొమ్మిదో రోజు వరకు ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి వంద క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 75 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి రూ.105 కోట్లు గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.54 కోట్ల షేర్ ను వసూల్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం తండేల్ మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. స్టడీగా వసూళ్లు రాబడుతూ నెమ్మదిగా లాభాల బాటల్లోకి ఎంట్రీ ఇవ్వోతోంది.

తొలి రెండు రోజులు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూల్ చేసి.. ఆ తర్వాత 3 నుంచి 4 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేస్తూనే వస్తోంది. ఇలా మొదటి వారం తండేల్ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇక రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం స్టడీగానే వసూళ్లు చేస్తోంది. డే9న 2.4 కోట్ల నెట్ వసూల్ చేసి రూ.100 కోట్ల గ్రాస్ కు చేరుకొంది. డే10న రూ.3.10 కోట్ల నెట్ కలెక్షన్స్ తో దుమ్ములేపింది. ఈ క్రమంలోనే డే11వ రోజు కలెక్షన్స్ రూ.1.15 కోట్ల నెట్ గా వసూలైంది. తెలుగులో రూ.1.14కోట్లు, తమిళంలో ఒక లక్ష వసూల్ చేసినట్టు ట్రేడ్ లెక్కలు తెలుపుతున్నాయి.
ఈ క్రమంలో డే12 'తండేల్' వసూళ్లు ఇలా ఉన్నాయి. ఎర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం.. తండేల్ పన్నెండో రోజు రూ.కోటి వరకు నెట్ వసూల్ చేసింది. తెలుగులో స్టేట్స్ లో రూ.0.97 కోట్ల నెట్ వసూల్ చేసింది. వర్కింగ్ డేస్ లోనూ తండేల్ కోటి రూపాయల కలెక్షన్ ను రాబట్టడం ఆసక్తికరంగానే మారింది. సినిమా టాక్ బాగుండటంతోనే ఆడియెన్స్ నిదానంగా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను అదిస్తున్నారు.

ఇక ఇండియాలో ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.59.20 కోట్ల నెట్ వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.79.25 కోట్ల నెట్ ను రాబట్టింది. ఇక ఓవర్సీస్ రూ.11.05 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇండియాలో గ్రాస్ రూ.68.2 కోట్లు వసూలవడం విశేషం. చైతూ కెరీర్ లోనే 'తండేల్' వంద కోట్ల సినిమా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా.. సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ బాసు నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











