Thandel Day 13 Collections : ‘తండేల్’ 13వ రోజు కలెక్షన్స్.. స్పీడ్ తగ్గించిన చైతూ..!
అక్కినేని నాగచైతన్య లేటెస్డ్ ఫిల్మ్ 'తండేల్'. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు మొదటి వారం అదిరిపోయాయి. ఇక సెకండ్ వీక్ లోనూ అదిరిపోయాయి. మొన్నటి వరకు స్టడీగానే వసూళ్లు చేసింది. డే12న కూడా 'తండేల్' తనకు రావాల్సిన వసూళ్లను అదే స్థాయిలో రాబడుతూ వచ్చింది. కానీ డే13కు కాస్తా కలెక్షన్లు తగ్గినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఫస్ట్ వీక్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు దిగుతున్నా.. తండేల్ థియేట్రికల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దాంతో కలెక్షన్లు కూడా అదిరిపోయాయి.
ఇక మొదటి వారం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫామ్ చేయడమే కాకుండా రెండో వారం ప్రారంభంలో రూ.100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. ఇప్పుడు సెకండ్ వీక్ కూడా పూర్తి కాబోతోంది. అయితే డే13న ఈ చిత్రం వసూళ్లు చూస్తే బాక్సాఫీస్ వద్ద 'తండేల్' జోరు తగ్గినట్టు కనిపిస్తోంది. డే13న 0.75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లోనే ఈ చిత్రానికి వసూళ్లు జరుగుతున్నాయి. డే11, డే12 మాత్రం తెలుగు స్టేట్స్ తో పాటు తమిళంలో కూడా రూ.లక్ష వరకు వసూల్ చేసింది. ఇక డే13న అది కూడా తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం.. తండేల్ డే13న రూ.75 లక్షల నెట్ మాత్రమే వసూల్ చేసింది.

ఈ చిత్రం ఫస్ట్ డే రూ.21 కోట్ల గ్రాస్ వసూల్ చేసి మంచి ఓపెనింగ్ ను ప్రారంభించింది. అలాగే డే2, డే3, నాలుగో రోజు కూడా మంచిగానే పెర్ఫామ్ చేసింది. కోట్లట్లో వసూళ్లు చేసింది. మొదటి వారం పూర్తయ్యే వరకు బాక్సాఫీస్ వద్ద 'తండేల్' హవానే కొనసాగింది. ఇక సెకండ్ వీక్ ఎంటరవ్వడంతోనే తొమ్మిదో రోజున ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి వంద క్లబ్ లో జాయిన్ అయ్యింది. దాంతో చైతూ కెరీర్ లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అలాగే నాగచైతన్య ఇప్పటి వరకు చేసిన అన్నీ చిత్రాల్లో ఇదే ఉత్తమ సినిమా అని ఆడియెన్స్ చెబుతున్నారు.
మొదటి వారంలాగే.. రెండో వారం కూడా స్టడీగానే వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు ఇప్పటికే అంచనా వేశాయి. డే12 వరకు లెక్కలు బాగానే ఉన్నా... డే13న వచ్చిన కలెక్షన్లతో 'తండేల్' డ్రాప్ అవుతున్నట్టు కనిపిస్తోంది. డే1 నుంచి డే 12 వరకు వర్క్ డేస్ లోనూ తండేల్ రూ.1 కోటీకి తక్కువగా కలెక్ట్ చేయలేదు. ఇక ఫస్ట్ టైమ్ పదమూడోరోజు రూ.75 లక్షలు మాత్రమే వసూళ్లయ్యాయి.

ఇవ్వాళ్టితో ఈ చిత్రం రెండో వారం కూడా పూర్తి చేసుకోనుంది. ఈరోజు కూడా ఎంత కలెక్ట్ అవుతుందో చూస్తే చైతూ స్పీడ్ కు బ్రేక్ లు పడతాయా? లేదా? అన్నది చూడాలి. ఇక మూడో వీకెండ్, రాబోయే శుక్ర, శని, ఆది వారాల్లోనూ 'తండేల్' బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక 75 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి రూ.105 కోట్లు గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. దీంతో రూ.54 కోట్ల షేర్ ను వసూల్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం రూ.80.05 కోట్ల నెట్ ను వసూల్ చేసింది. ఇక ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. సాయిపల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ బాసు నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











