Thandel Day 15 Collections : ‘తండేల్’ 15వ రోజు కలెక్షన్స్.. థర్డ్ వీక్ మరీ స్లో అయిన కలెక్షన్స్ ఎంతంటే?
నాగచైతన్య - సాయిపల్లవి 'తండేల్' చిత్రం రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద స్టడీగానే వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి21తో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్, సెకండ్ వీక్ లో స్టడీగానే వసూళ్లు రాబట్టి తండేల్ మూడో వారం ఎంట్రీలోనే ఇంకా డల్ అయ్యింది. అయితే మూడో శని, ఆది వారాల లెక్కలతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫామ్ చేయబోతుందనేది తెలియనుంది.
తండేల్ వరల్డ్ వైడ్ గా తెలుగుతోపాటు హిందీ, తమిళ వెర్షన్ లోనూ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య కెరీర్ లోనే తొలిరోజు మంచి కలెక్షన్లను రాబట్టింది. రూ.21 కోట్ల గ్రాస్ వసూల్ చేసి అదరగొట్టింది. ఆడియెన్స్ నుంచి మంచి టాక్ రావడంతో.. మొదటి వారం అద్భుతంగా పెర్ఫామ్ చేసిందీ చిత్రం. కేవలం మూడు రోజుల్లోనే రూ.60కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. ఇక డే9న తండేల్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చైతూ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిత్రంగానూ 'తండేల్' ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

కాగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మొన్నటి వరకు స్టడీగానే వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ వీక్ మొత్తం కలెక్షన్లు రూ.49.4 కోట్ల నెట్ వసూల్ చేసింది 'తండేల్'. ఇందులో తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్లు నెట్ రాబట్టింది. ఇక రెండో వారం ముగిసే సరికి రూ.11.3 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగుల స్టేట్స్ లో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ వసూల్ చేసింది. ఫస్ట్ వీక్ తో పోలిస్తే 77శాతానికి పైగా బాక్సాఫీస్ కలెక్షన్లు పడిపోయాయి. ప్రస్తుతం 'తండేల్' మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.
డే14న రూ.70 లక్షల వరకు వసూళ్లు రాబట్టగా.. మూడో వారంలో మొదటి రోజు డే15న రూ.50 లక్షలు మాత్రమే వసూల్ చేసింది. వీక్ ఎండ్ శుక్రవారం అయినా వసూళ్లు మాత్రం పెరగ లేదు. రోజురోజుకు తగ్గుతూనే వస్తున్నాయి. ఇక, శని, ఆది వారాల్లోనైనా తండేల్ బాగా పెర్ఫామ్ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి. నిన్నటితో కొత్త రిలీజ్ లు 'డ్రాగన్', 'రామం రాఘవం', 'బాపు', 'జాబిలమ్మ నీకు అంత కోపమా' వంటి చిత్రాలు ఉండటంతో తండేల్ పోటీనుంచి తప్పుకుంటుందా? అనేది వేచిచూడాల్సిందే.
ఇక ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కార్తీకేయ2 తర్వాత 'తండేల్'తో మరోసారి హిట్ అందుకున్నాడు చందూ. శ్రీకాకుళం ఫిషర్ మెన్ రాజు పాత్రలో నాగ చైతన్య అద్భుతంగా నటించారు. సాయిపల్లవి మరోసారి తన బెస్ట్ పెర్ఫామెన్స్ అందించింది. ప్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తి మిళితమైన ఈ చిత్రం ఆడియెన్స్ ను మెప్పించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











