Thandel Day 16 Collections : ‘తండేల్’ 16వ రోజు కలెక్షన్స్.. మళ్లీ ఫామ్ లోకి వచ్చిన చైతూ.!

అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్' ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతూనే ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద స్టడీగానే వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ.21 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో నాగ చైతన్య కెరీర్ లో ఈ చిత్రం హయ్యేస్ట్ డే1 వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే మొన్నటి వరకు వసూళ్లు తగ్గుతూ రావడంతో ఈ చిత్రం పోటీ నుంచి తప్పుకుంటుందేమో అనిపించింది. కానీ సడెన్ గా వసూళ్లు పెరగడం ప్రారంభమైంది.

ఫిబ్రవరి21తో ఈ చిత్రం మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్, సెకండ్ వీక్ లో స్టడీగానే వసూళ్లు రాబట్టిన తండేల్ మూడో వారం ఎంట్రీలో చాలా డల్ అయ్యింది. దీంతో మూవీ బాక్సాఫీస్ పోటీ నుంచి తప్పుకుంటుందేమోననే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఫస్ట్, సెకండ్ వీక్ లో వర్క్ డేస్ లోనూ మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. మధ్యలో కాస్తా పలుచబడింది. చైతూ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడుతుందనే లోపే థర్డ్ వీక్ ఎండ్ లో ఒక్కసారిగా వసూళ్లను వెనక్కి తిరిగి తీసుకోగలిగింది. డే16న ఈ చిత్రం వసూళ్లు ఇలా ఉన్నాయి.

Sai Pallavi Naga Chaitanya s Thandel Movie Day 16 Box Office collections worldwide

డే14న రూ.70 లక్షల వరకు వసూళ్లు రాబట్టగా.. మూడో వారంలో మొదటి రోజు డే15న రూ.50 లక్షలు మాత్రమే వసూల్ చేసింది. ఇక డే16న తన సత్తా చూపిస్తూ రూ. 1 కోటి వరకు నెట్ కలెక్ట్ చేసింది. ఇక ఆదివారం రోజు కూడా ఎలా పెర్ఫామ్ చేస్తుందనేది చూడాలి. శుక్రవారం కొత్త రిలీజ్ లు 'డ్రాగన్', 'రామం రాఘవం', 'బాపు', 'జాబిలమ్మ నీకు అంత కోపమా' వంటి చిత్రాలు వచ్చినా తండేల్ పోటీలో నిలుస్తున్నట్టు కనిపిస్తోంది.

Sai Pallavi Naga Chaitanya s Thandel Movie Day 16 Box Office collections worldwide

ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. థర్డ్ వీక్ కూడా మంచి వసూళ్లు రాబడుతుందా? అన్నది చూడాలి. ఇక ఫస్ట్ వీక్ మొత్తం కలెక్షన్లు రూ.49.4 కోట్ల నెట్ వసూల్ చేసింది 'తండేల్'. ఇందులో తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్లు నెట్ రాబట్టింది. ఇక రెండో వారం ముగిసే సరికి రూ.11.3 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగుల స్టేట్స్ లో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ వసూల్ చేసింది. థర్డ్ వీక్ టోటల్ కలెక్షన్స్ కూడా ఎంత వస్తాయో చూడాలి. చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X