Thandel Day 18 Collections : భారీగా తగ్గిన ‘తండేల్’ వసూళ్లు.. 18వ రోజు ఎంత వసూలైందంటే?
'తండేల్' కలెక్షన్లు భారీగా తగ్గిపోతున్నాయి. రెండో వారం తర్వాత ఈ చిత్రం వసూళ్లు క్రమంగా తక్కుతూ వస్తున్నాయి. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే రూ.106 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గా వసూళ్లు సాధించింది. ఫ్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తి మిళితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతూనే ఉంది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సెకండ్ వీకెండ్ వరకు జోరు చూపించిన 'తండేల్' థర్డ్ వీక్ లో మాత్రం కాస్తా డీలా పడింది.
రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద తండేల్ స్టడీగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం తొలిరోజే రూ.21 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. నాగ చైతన్య కెరీర్ లోనే మొదటిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. చైతూ కెరీర్ లోనే 'తండేల్' బిగ్గేస్ట్ కూడానూ. ఇదిలా ఉంటే.. మూడో వారంలో బక్సాఫీస్ లెక్కలు భారీగా మారిపోయాయి. వసూళ్లు తగ్గుతూ రావడంతో ఈ చిత్రం పోటీ నుంచి తప్పుకుంటుందా? అనే సందేహం కలుగుతోంది. మొదటి వారం రూ.3 నుంచి రూ.4 కోట్లకు తగ్గకుండా వసూళ్లు రాబట్టి.. ఫస్ట్ వీక్ మొత్తంగా 49.4 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్లు నెట్ రాబట్టింది.

ఇక రెండో వారం ముగిసే సరికి రూ.11.3 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ వసూల్ చేసింది. ఇక మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా ఈ చిత్రం వసూళ్లు కాస్తా డల్ అయ్యాయి. రెండో వారం ముగింపులో డే14న రూ.70 లక్షలు, మూడో వారంలో మొదటి రోజు డే15న రూ.60 లక్షలు వసూల్ చేసింది. కానీ వీకెండ్ లో మాత్రం కాస్తా కలెక్షన్లు పెరుగుతున్నా.. వర్క్ డేస్లో మాత్రం భారీగా పడిపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద డే18న మాత్రం వసూళ్లు ఏకంగా 74 శాతానికి పడిపోయాయి. కానీ డే16న రూ.1.02 కోట్ల నెట్ వసూల్ చేసింది. డే17న రూ.1.16కోటి నెట్ వసూల్ చేసింది.
అయితే వీకెండ్స్ లో మాత్రమే ఈ చిత్రం వసూళ్లను రాబడుతోంది. ఫిబ్రవరి 24న, డే18వ రోజు తండేల్ కలెక్షన్లు భారీగా తగ్గి రూ.45 లక్షలు మాత్రమే వసూల్ చేసింది. ఇక హిందీ, తమిళంలో కొద్దిరోజులుగా ఆక్యుపెన్సీ లేదు. కలెక్షన్లు పూర్తిగా రావడం లేదు. దీంతో తెలుగు స్టేట్స్ లోనే 'తండేల్' వసూళ్లు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. వర్క్ డేస్ లో రూ.50 లక్షల వరకు వసూల్ చేస్తోంది. ఇక వీకెండ్ లో మాత్రం రూ.1 కోటి వరకు వసూళ్లు రాబడుతోంది.
ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.83 కోట్ల నెట్ ను వసూల్ చేసిందీ చిత్రం. ఇండియాలో రూ.63.93 కోట్ల నెట్ రాబట్టింది. ఇండియా గ్రాస్ రూ.71.85 కోట్లు కావడం విశేషం. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో రూ.11.15 కోట్ల నెట్ రాబట్టింది. ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











