Thandel Day 19 Collections : ‘తండేల్’ 19వ రోజు కలెక్షన్లు... ఆసక్తికరంగా చైతూ వసూళ్లు!
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్'. ఫిబ్రవరి 7న తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్ గా విడుదలైంది. తొలిరోజే ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఫస్ట్ డేనే రూ.21కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద మంచి స్టార్ట్ ను ప్రారంభించాడు నాగచైతన్య. ఫస్ట్, సెకండ్ వీక్ ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో థర్డ్ వీక్ కలెక్షన్లపైనా ఆసక్తి నెలకొంది. అయితే ఒక్కో వారంలో ఒక్కోలా ఈ చిత్రం ఆసక్తికరంగా వసూళ్లు రాబడుతోంది.
మొదటి వారంతో పోల్చితే 'తండేల్' కలెక్షన్లు ప్రస్తుతం భారీగా తగ్గిపోతున్నాయి. రెండో వారం తర్వాత ఈ చిత్రం వసూళ్లు క్రమంగా తక్కుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వసూళ్లు 70 శాతానికి తగ్గినా.. థర్డ్ వీక్ లో రూ.50 లక్షల వరకు నెట్ వసూళ్లు చేస్తోంది. ఈ రేంజ్ లో ప్రతిరోజూ కలెక్షన్లను రాబడుతూ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. దీంతో బాక్సాఫీస్ లెక్కలు భారీగా మారిపోయాయి. వసూళ్లు తగ్గుతూ రావడంతో ఈ చిత్రం పోటీ నుంచి తప్పుకుంటుందా? అనే సందేహం కలిగింది.

తండేల్.. మొదటి వారం రూ.3 నుంచి రూ.4 కోట్లకు తగ్గకుండా వసూళ్లు రాబట్టి.. ఫస్ట్ వీక్ మొత్తంగా 49.4 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్లు నెట్ రాబట్టింది. రెండో వారం ముగిసే సరికి రూ.11.3 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ వసూల్ చేసింది.
రెండో వారం ముగింపులో డే14న రూ.70 లక్షలు, మూడో వారంలో మొదటి రోజు డే15న రూ.60 లక్షలు వసూల్ చేసింది. కానీ వీకెండ్ లో మాత్రం కాస్తా కలెక్షన్లు పెరుగుతున్నా.. వర్క్ డేస్లో మాత్రం భారీగా పడిపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద డే18న మాత్రం వసూళ్లు ఏకంగా 74 శాతానికి పడిపోయాయి. కానీ డే16న రూ.1.02 కోట్ల నెట్ వసూల్ చేసింది. డే17న రూ.1.16కోటి నెట్ వసూల్ చేసింది. డే18వ రోజు తండేల్ కలెక్షన్లు భారీగా తగ్గి రూ.50 లక్షలు మాత్రమే వసూల్ చేసింది. ఇక హిందీ, తమిళంలో కొద్దిరోజులుగా ఆక్యుపెన్సీ లేదు. డే19న రూ.0.43 కోట్లు వసూల్ చేసింది. రేపటితో థర్డ్ వీక్ పూర్తి కానుంది. అలాగే ఫోర్త్ వీకెండ్ స్టార్ట్ కానుంది. దీంతో ఇంకెత వసూల్ చేస్తుందనేది చూడాలి.

హిందీ, తమిళంలో కలెక్షన్లు పూర్తిగా రావడం లేదు. దీంతో తెలుగు స్టేట్స్ లోనే 'తండేల్' వసూళ్లు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. వర్క్ డేస్ లో రూ.50 లక్షల వరకు వసూల్ చేస్తోంది. ఇక వీకెండ్ లో మాత్రం రూ.1 కోటి వరకు వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.86 కోట్ల నెట్ ను వసూల్ చేసిందీ చిత్రం. ఇండియాలో రూ.64.03 కోట్ల నెట్ రాబట్టింది. ఇండియా గ్రాస్ రూ.74.55 కోట్లు కావడం విశేషం. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో రూ.11.45 కోట్ల నెట్ దక్కింది. ఫ్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తి మిళితమైన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించి తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతంతో చిత్రానికి మరింత హైప్ నిచ్చారు.


Click it and Unblock the Notifications











