Thandel Day 20 Collections : ‘తండేల్’ 20వ రోజు కలెక్షన్లు.. చైతూ షాకింగ్ వసూళ్లు!
అక్కినేని హీరో నాగచైతన్య - సాయిపల్లవి జంటగా వచ్చిన చిత్రం 'తండేల్'. 20 రోజుల కింద ఫిబ్రవరి 7న తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ జరిగింది. తొలిరోజే ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ప్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తి కలిగిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో ఫస్ట్ డేనే రూ.21కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద మంచి స్టార్ట్ ను ప్రారంభించాడు చైతన్య. ఆ తర్వాత నుంచి వరుసగా రెండు వారాలు బాక్సాఫీస్ కలెక్షన్లు జోరుగా సాగాయి. ఇక మూడో వారంలో భారీగా తగ్గినా వసూళ్లు తీరు మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
ఫస్ట్, సెకండ్ వీక్ ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది. థర్డ్ వీక్ కలెక్షన్లపైనా ఆసక్తి నెలకొంది. ఒక్కో వారంలో ఒక్కోలా ఈ చిత్రం ఆసక్తికరంగా వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ సాధించింది. డే19 వరకు ఈ చిత్రం ఇండియాలో రూ.64.05 కోట్ల నెట్ సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ.86.60 కోట్ల నెట్, ఓవర్సీస్ లో రూ.11.50 కోట్ల నెట్, ఇండియాలో గ్రాస్ మాత్రం రూ.75.10 కోట్ల వరకు వసూళ్లు చేసింది. కేవలం డే19న రూ.45 లక్షలు వసూళ్లు చేసింది.

తమిళం, హిందీలోనూ రిలీజ్ అయిన 'తండేల్' రెండు వారాల వరకే ఇతర భాషల్లో వసూళ్లు రాబట్టగలిగింది. థర్డ్ వీక్ లో పూర్తిగా తెలుగులోనే వసూళ్లు చేస్తోంది. ఇప్పటి వరకు వసూళ్లు 70 శాతానికి తగ్గినా.. థర్డ్ వీక్ లో రూ.50 లక్షలు తగ్గకుండా వసూళ్లు రాబడుతోంది. డే20న రూ.56 లక్షలు వసూల్ చేసింది. ఇందులో తెలుగు స్టేట్స్ లో రూ.55 లక్షలు కాగా.. హిందీలో ఒక లక్ష రాబట్టింది. మహాశివరాత్రి వేళ గతరోజుతో పోల్చితే కాస్తా మెరుగ్గా వసూళ్లు వచ్చాయి.
అయితే తండేల్ ఒక్కో వారంలో ఒక్కోలా వసూళ్లు చేస్తూ ఆశ్చర్య పరుస్తోంది. మొదటి వారం రూ.3 నుంచి రూ.4 కోట్లకు తగ్గకుండా వసూళ్లు చేసింది. ఫస్ట్ వీక్ మొత్తంగా 49.4 కోట్ల నెట్ వసూలైంది. తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్ల నెట్ వచ్చాయి. రెండో వారం ముగిసే సరికి రూ.11.3 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ రాబట్టగలిగింది.
తండేల్ మూడో వారం ముగిసే వరకు రోజు రూ.50 లక్షలకు తగ్గకుండా నెట్ వసూల్ చేసింది. వీకెండ్స్ లో రూ.కోటి వరకు నెట్ రాబట్టగలిగింది. ఇక ఫోర్త్ వీక్ లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు చేస్తుందో చూడాలి. రేపటితో థర్డ్ వీక్ ముగియనుంది. డే20 వరకు మొత్తంగా ఈ చిత్రం ఇండియాలో రూ.64.61 కోట్ల నెట్ రాబట్టింది. ఇండియా గ్రాస్ రూ.75.10 కోట్లు రావడం విశేషం. ఈ చిత్రానికి ఓవర్సీస్ లో రూ.11.50 కోట్ల నెట్ దక్కింది. ఈ చిత్రానికి 'కార్తీకేయ 2' బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించి తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతంతో చిత్రానికి మరింత హైప్ తెచ్చారు.


Click it and Unblock the Notifications











