Thandel Day 21 Collections : ‘తండేల్’ 21వ రోజు కలెక్షన్లు.. ఎంతో తెలుసా.. ఇది నిజంగా షాకింగే.!
అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్'. 20 రోజులుగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఫిబ్రవరి 7న గ్రాండ్ గా విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. థియేట్రికల్ రన్ మాత్రం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. తొలిరోజే ఈ లవ్ అండ్ యాక్షన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. ప్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తి మిళితమై ఉండటంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇరవై రోజులు దాటినా ఇంకా థియేటర్లలోనే సందడి చేస్తుండటం విశేషంగా మారింది.
ఇక 'తండేల్' బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల విషయానికొస్తే..
తొలి రోజే ఈ చిత్రానికి రూ.21కోట్ల గ్రాస్ వసూలైన విషయం తెలిసిందే. ఈ రేంజ్ కలెక్షన్లతో చైతూ తొలిసారిగా బాక్సాఫీస్ వద్ద మంచి స్టార్ట్ ను ప్రారంభించాడు. రెండో రోజు రూ. 15 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. అలా మొదటి వారం మొత్తం బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫామెన్స్ చూపించిందీ చిత్రం. రెండో వారం కూడా కలెక్షన్ల జోరు చూపించిందీ మూవీ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

ఫస్ట్ వీక్ మొత్తంగా 49.4 కోట్ల నెట్ వసూలైంది. తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్ల నెట్ వచ్చాయి. రెండో వారం ముగిసే సరికి రూ.11.3 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ రాబట్టగలిగింది. ఇక మూడో వారంలో మాత్రం కాస్తా తగ్గుతూ లేస్తూ వసూళ్లు అందాయి. రూ.1కోటి నుంచి రూ.50 లక్షల మధ్య కలెక్షన్లు వచ్చాయి.
అయితే నేటితో తండేల్ మూడో వారం ముగిసి నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. డే20 వరకు మొత్తంగా ఈ చిత్రం ఇండియాలో రూ.64.61 కోట్ల నెట్ రాబట్టింది. ఇండియా గ్రాస్ రూ.75.10 కోట్లు రావడం విశేషం. ఈ చిత్రానికి ఓవర్సీస్ లో రూ.11.50 కోట్ల నెట్ దక్కింది. ఈ వసూళ్లు ఇండియా నెట్ కావడం విశేషం. ఇక డే21న రూ.54 లక్షల నెట్ వసూల్ చేసింది. ఇవన్నీ తెలుగులో చేసిన వసూళ్లే.. డే9 నుంచి డే20 వరకు హిందీలో రూ.లక్ష మాత్రమే వసూల్ చేసింది.
ఇక తండేల్ 21వ రోజు వరకు వరల్డ్ వైడ్ గా మొత్తంగా రూ.87.23 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇండియా నెట్ రూ.65.15 కోట్లు అందుకుంది. ఇండియా గ్రాస్ రూ.75.73 కోట్లు వసూలైంది. ఇక ఓవర్సీస్ లో రూ.11.5 కోట్లు నమోదైంది. మరోవైపు తండేల్ టీమ్ రెండో వారం ముగింపులోనే రూ.106 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.52 కోట్లకు పైగా షేర్ ను కూడా అందుకోవడం విశేషం. ఇక నాలుగో వారంలో తండేల్ ఎలాంటి వసూళ్లు రాడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











