Thandel Day 22 Collections : ‘తండేల్’ 22వ రోజు కలెక్షన్లు.. మూడు వారాల్లో ఖేల్ ఖతం.. లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే?
అక్కినేని నాగచైతన్య 'తండేల్' చిత్రం మూడు వారాలుగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. మొదటిసారిగా చైతూ కెరీర్లోనే ఈ సినిమా మంచి మార్క్ ను క్రియేట్ చేసింది. నేటితో ఈ చిత్రం మూడు వారాల కలెక్షన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విషయం తెలిసిందే. కాగా మొదటి రెండు వారాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద రూ.కోటీ నుంచి రూ.3 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఇక థర్డ్ వీక్ లో కాస్తా డీలా పడింది. మూడో వారం మొత్తం కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి.
తొలి రోజే ఈ చిత్రానికి రూ.21కోట్ల గ్రాస్ వసూలైన విషయం తెలిసిందే. డే1న రూ.11.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇక రెండో రోజు రూ.12.1 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసి అదరగొట్టింది. ఇక మూడో రోజు రూ.12.7 కోట్లు రాబట్టింది. మొదటి మూడు రోజులు ఈ చిత్రం వరుసగా రూ.పది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆకట్టుకుంది. ఆ తర్వాత భారీగా వసూళ్లు తగ్గాయి. ఫస్ట్ వీక్ రూ.4 కోట్ల వరకు, సెకండ్ వీక్ రూ.2కోట్ల వరకు డీసెంట్ గా వసూళ్లను చేసింది. ఇక మూడో వీక్ మరింతగా కలెక్షన్లు తగ్గాయి.

ఫస్ట్ వీక్ మొత్తంగా 49.4 కోట్ల నెట్ వసూలైంది. తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్ల నెట్ వచ్చాయి. రెండో వారం ముగిసే సరికి రూ.11.3 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ రాబట్టగలిగింది. ఇక మూడో వారం పూర్తయ్యే సరికి రూ.4.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇందులో తెలుగులో రూ.4.34 కోట్ల నెట్, హిందీలో రూ.లక్ష వసూల్ చేసింది. కొత్త రీలీజ్ ల కారణంగా తమిళంలో జీరో వసూళ్లు అయ్యాయి.
డే22న రూ.8 లక్షలు మాత్రమే వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కొత్త రిలీజెస్ ఉండటంతో ఈ సినిమా వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ఫోర్త్ వీక్ లో మొదటి రోజు రూ.8 లక్షలు మాత్రమే వసూళ్లు చేయడం షాకింగ్ మారింది. ఈ లెక్కన మూడు వారాల్లోనే ఈ చిత్రం వసూళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. మూడు వారాలు పూర్తయ్యే సరికి టోటల్ గా ఇండియాలో రూ.65.05 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇందులో తెలుగులో రూ.63.98 కోట్లు రాబట్టింది. హిందీలో రూ.55 లక్షలు, తమిళంలో రూ.52లక్షలు అందుకుంది.
వరల్డ్ వైడ్ గా రూ.87.75 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. కానీ ఇప్పటికే రూ.106 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టు 'తండేల్' యూనిట్ అధికారిక ప్రకటన చేయడం గమనార్హం. ఏదేమైనా తండేల్ చైతూ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. సాయి పల్లవి హీరోయిన్ అలరించింది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











