Thandel Day 23 Collections : ‘తండేల్’ 23వ రోజు కలెక్షన్లు.. చైతూ పోరాటం.. ఎంత వసూలైదంటే?
మూడు వారాల పాటు అక్కినేని నాగచైతన్య 'తండేల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాస్తా స్టడీగానే వసూళ్లు రాబట్టింది. మొదటి వారం వసూళ్ల వర్షం కురిపించింది. చైతూ కెరీర్లోనే ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఉత్తమ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం 'తండేల్' ఫోర్త్ వీక్ లో బాక్సాఫీస్ వద్ద ఫైట్ చేస్తోంది. థర్డ్ వీక్ వరకు కాస్తో కూస్తో మంచి వసూళ్లనే సాధించిన ఈ చిత్రం ఇక చివరి దశలో వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటి వరకు రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిన ఈ చిత్రం ఫోర్త్ వీక్ లో చాలా వీక్ గా వసూళ్లను రాబడుతోంది.
మొదటి రెండు వారాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద రూ.కోటీ నుంచి రూ.3 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఇక థర్డ్ వీక్ లో కాస్తా డీలా పడింది. ఫోర్త్ వీక్ స్టార్ట్ అయ్యే సరికి మరీ వీక్ గా మారింది. ఇక తండేల్ తొలిరోజే రూ.21కోట్ల గ్రాస్ వసూల్ చేసిన సంగతి తెలిసిందే. డే1న రూ.11.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇక రెండో రోజు రూ.12.1 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసి అదరగొట్టింది. ఇక మూడో రోజు రూ.12.7 కోట్లు రాబట్టింది. మొదటి మూడు రోజులు రూ.పది కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది.

ఇక ఫోర్త్ వీక్ విషయానికొస్తే.. మొదటి రోజు డే22న రూ.8 లక్షలు మాత్రమే వసూళ్లు సాధించింది. ఉన్నట్డుండి వసూళ్లు భారీగా పడిపోయాయి. ఇక డే23న మాత్రం రూ.20 లక్షల వరకు వసూళ్లు చేసింది. హిందీలో 23వ రోజు లక్ష వసూలైంది. తమిళంలో కొద్దిరోజులుగా కలెక్షన్లు లేకపోవడం గమనార్హం. థర్డ్ వీక్ పూర్తయ్యే సరికి టోటల్ గా ఇండియాలో రూ.65.05 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇందులోంచి తెలుగు స్టేట్స్ లో రూ.63.98 కోట్లు రాబట్టింది. హిందీలో రూ.55 లక్షలు, తమిళంలో రూ.52లక్షలు వసూళ్లు చేసింది.
ఇక 'తండేల్' ఫస్ట్ వీక్ మొత్తంగా 49.4 కోట్ల నెట్ వచ్చింది. తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్ల నెట్ అందుకుంది. రెండో వారం ముగిసే సరికి రూ.11.3 కోట్ల నెట్ అందింది. తెలుగు స్టేట్స్ లో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ వచ్చింది. ఇక థర్డ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.4.35 కోట్ల నెట్ అందింది. వీటిలో తెలుగు స్టేల్స్ లో రూ.4.34 కోట్ల నెట్, హిందీలో రూ.లక్ష మాత్రమే వసూలైంది. తమిళంలో కొత్త రిలీజ్ ల కారణంగా పూర్తిగా వసూళ్లు ఆగిపోయాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 'డ్రాగన్', 'జాబిలమ్మ నీకు అంత కోపమా', మరోవైపు బాలీవుడ్ సెన్సేషనల్ ఫిల్మ్ 'ఛావా' కూడా తెలుగులోకి రిలీజ్ కాబోతున్నది. ఈ కారణంగా 'తండేల్' బాక్సాఫీస్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. వర్క్ డేస్ లో ఇప్పటికే ఈ చిత్రం భారీగా ఆక్యుపెన్సీని కోల్పోయింది. వీక్ డేస్ లో మాత్రమే అత్యల్పంగా వసూళ్లు చేస్తోంది. డే23న శనివారం కావడంతో రూ.20 లక్షల వరకు వసూళ్లు చేసింది. ఇక ఆదివారం ఎంత వసూల్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు నిర్మించారు. దేవీశ్రీ సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది.


Click it and Unblock the Notifications











