Thandel Day 25 Collections : ‘తండేల్’ 25వ రోజు కలెక్షన్లు.. ఎంత వసూలైందంటే?
అక్కినేని నాగ చైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్'. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. మౌత్ పబ్లిసిటీ తో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. మొదటి రెండు వారాలు ఈ చిత్రం రూ.3 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఫోర్త్ వీక్ లో మాత్రం దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి. అయినా చైతూ అంతో ఇంతో వసూళ్లు చేస్తూనే వస్తున్నారు.
కొత్త రిలీజ్ లతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నా.. ఇప్పటికే రూ.106 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన 'తండేల్' మిగిలిన కలెక్షన్లను కూడా రాబడుతోంది. ఇప్పటికే స్టడీగా వసూళ్లు రాబట్టి రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. కాగా ఫోర్త్ వీక్ లోనూ కలెక్షన్ల విషయంలో నిదానమే ప్రధానం అంటూ గల్లా పెట్టా మాత్రం నింపుతోంది 'తండేల్'. డే19 వరకే ఈ చిత్రం రూ.106కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేయగా.. ఆ తర్వాత నుంచి వచ్చినంత వసూళ్లను అందుకుంటోంది.

తొలిరోజే 'తండేల్' రూ.21కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. డే1న రూ.11.5 కోట్ల నెట్ వసూల్ అందుకుంది. ఇక రెండో రోజు రూ.12.1 కోట్ల వరకు ఇండియాలో నెట్ వసూల్ చేసింది. డే3న రూ.12.7 కోట్లు రాబట్టింది. అలా మొదటి మూడు రోజులు మాత్రం రూ.పది కోట్లకు పైగా నెట్ వసూళ్లు చేసి అదరగొట్టింది. ప్రజెంట్ ఫోర్త్ వీక్ లో వసూళ్లను అందుకుంటోంది.
డే23న ఈ చిత్రానికి రూ.25 లక్ష నెట్ వసూలైంది. డే24న సెకండ్ ఆదివారం రూ.25 లక్షల నెట్ అందింది. ఇక డే25న కేవలం రూ.5 లక్షలు నెట్ మాత్రమే వసూల్ చేసింది. ఏదేమైనా ఈ చిత్రం తాబేలు, కుందేలు కథలా వసూళ్ల పరంగా స్లోగానే నెగ్గినట్టుగా ఖజానా నింపుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి తెలుగు స్టేట్స్ లోనే వసూళ్లు అందుతున్నాయి. హిందీలో రూ. లక్ష కలెక్ట్ చేస్తున్నా.. రెగ్యులర్ కలెక్షన్ లేదు. ఇక తమిళంలో పూర్తిగా వసూళ్లు ఆగిపోయాయి.
ఇక 'తండేల్' ఫస్ట్ వీక్ లో రూ.49.4 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్ల నెట్ అందుకుంది. సెకండ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.11.3 కోట్ల నెట్ వచ్చింది. తెలుగు స్టేట్స్ లో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ రాబట్టింది. థర్డ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.4.35 కోట్ల నెట్ అందింది. తెలుగులో రూ.4.34 కోట్ల నెట్, హిందీలో రూ.లక్ష వసూల్ చేసింది. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పించారు. బన్నీ వాసు నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











