Thandel Day 26 Collections : ‘తండేల్’ 26వ రోజు కలెక్షన్లు.. ఫోర్త్ వీక్ లోనూ చైతూ మేజిక్!

'తండేల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గించింది. త్వరలో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ చిత్రం వచ్చిన కాడికి వసూళ్లను మాత్రం అందుకుంటోంది. అక్కినేని నాగ చైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన 'తండేల్' గత నెల ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఆడియెన్స్ నుంచి ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అంతే కాదు.. మౌత్ పబ్లిసిటీ బాగుండటంతో బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల సునామీగా మారింది. ఇటీవల కాలంలో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం తర్వాత 'తండేల్'కే మంచి కలెక్షన్లు అందాయి.

'కార్తీకేయ 2' ఫేమ్ చందూ మొండేటీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తన నటన, డ్యాన్స్ తో ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను కూడా ఫిదా చేసింది. మరోవైపు చైతూతో ఆన్ స్క్రీన్ రోమాన్స్ ను అదరగొట్టింది. లవ్, ఎమోషనల్ సీన్లలో చైతూ, సాయిపల్లవి అద్భుతమైన పెర్ఫామ్ చేశారు. ఈ బ్యూటీఫుల్ లవ్, యాక్షన్ తోపాటు దేశభక్తిని చూపించిన చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. రూ.70 కోట్లతో బన్నీ వాసు నిర్మించిన సంగతి తెలిసిందే.

Sai Pallavi Naga Chaitanya s Thandel Movie Day 26 Box Office collections worldwide

కాగా.. తండేల్ బాక్సాఫీస్ వద్ద ఇంకా వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.106 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన 'తండేల్' ఫోర్త్ వీక్ లోనూ వచ్చిన కాడికి కలెక్షన్లు చేసుకుంటోంది. ఇక నాలుగో వారంలో డే23న రూ.25 లక్ష నెట్ వసూలైంది. డే24న సెకండ్ ఆదివారం రూ.25 లక్షల నెట్ అందుకుంది. ఇక డే25న కేవలం రూ.5 లక్షలు నెట్ మాత్రమే వసూల్ చేసింది. ఇక డే26న కూడా మళ్లీ రూ.5 లక్షలు వసూల్ చేసింది. చైతూ ఇలా ఒక్కో వారంలో ఒక్కోలా వసూళ్లను అందుకుంటూ ఖజానా నింపుకుంటున్నారు. తక్కువ మొత్తంలో వసూళ్లు వచ్చినా థియేటర్లలో మాత్రం సందడి చేస్తూనే ఉన్నాడు.

గత కలెక్షన్ల విషయానికికొస్తే.... 'తండేల్' ఫస్ట్ వీక్ లో రూ.49.4 కోట్ల నెట్ అందుకుంది. అందులో తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్లు, తమిళంలో రూ. 0.47 కోట్లు వసూలైంది. సెకండ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.11.3 కోట్ల నెట్ వచ్చింది. తెలుగులో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ వచ్చింది. థర్డ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.4.35 కోట్ల నెట్ అందుకుంది. వీటిలో తెలుగులో రూ.4.34 కోట్ల నెట్, హిందీలో రూ.లక్ష వసూల్ చేసింది.

ఇక ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం రూ.64.74 కోట్ల నెట్ అందుకుంది. హిందీలో రూ.58 లక్షలు, తమిళంలో రూ.52 లక్షలు నెట్ వసూల్ చేసింది. 21 రోజుల వరకు మాత్రం వరల్డ్ వైగా రూ.87.75 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్టు తెలుస్తోంది. ఇండియాలో రూ.76.25 కోట్ల గ్రాస్ అందుకుందని, రూ.65.05 కోట్ల నెట్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో రూ.11.50 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. కానీ తండేల్ యూనిట్ మాత్రం ఈ చిత్రం 19వ రోజు వరకే రూ.106 కోట్లు కలెక్ట్ చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X