Thandel Day 27 Collections : ‘తండేల్’ 27వ రోజు కలెక్షన్లు..
'తండేల్' బాక్సాఫీస్ కలెక్షన్లు ఇంకా కొనసాగుతున్నాయి. 'కార్తీకేయ 2' ఫేమ్ చందూ మొండేటీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తన నటన, డ్యాన్స్ తో ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను కూడా ఫిదా చేసింది. మరోవైపు చైతూతో ఆన్ స్క్రీన్ రోమాన్స్ ను అదరగొట్టింది. లవ్, ఎమోషనల్ సీన్లలో చైతూ, సాయిపల్లవి అద్భుతమైన పెర్ఫామ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక బాక్సాఫీస్ వసూళ్ల విషయానికొస్తే..
ఇప్పటికే ఈ చిత్రం రూ.106 కోట్లకు పైగా వసూళ్లు అందుకుందని నిర్మాతలు ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.... 'తండేల్' ఫస్ట్ వీక్ లో రూ.49.4 కోట్ల నెట్ అందుకుంది. అందులో తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్లు, తమిళంలో రూ. 0.47 కోట్లు వసూలైంది. సెకండ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.11.3 కోట్ల నెట్ వచ్చింది. తెలుగులో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ వచ్చింది. థర్డ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.4.35 కోట్ల నెట్ అందుకుంది. ప్రస్తుతం నాలుగో వారంలో వీలైనంత వరకు వసూళ్లు అందుకుంటూ వస్తోంది.

ఫోర్త్ వీక్ లో డే23న సెకండ్ శనివారం రూ.25 లక్ష నెట్ వసూల్ చేసింది. డే24న సెకండ్ ఆదివారం రూ.25 లక్షల నెట్ అందుకుంది. ఇక డే25న కేవలం రూ.5 లక్షలు నెట్ మాత్రమే వసూల్ చేసింది. ఇక డే26న కూడా మళ్లీ రూ.5 లక్షలు వసూలైంది. ఇక డే27న రూ.4 లక్షల వరకు నెట్ వసూల్ చేసింది. ఇలా మొదటి వారంలో కోట్లలో, రెండో వారంలో కోటీ తగ్గకుండా, మూడో వారంలో 50 లక్షలకు పైగా, ప్రస్తుతం నాలుగో వారంలో భారీ తగ్గి రూ.5 లక్షల వరకు వసూళ్లు అందుకుంటోంది.
డే27 వరకు 'తండేల్' వరల్డ్ వైడ్ గా రూ.88.68 కోట్ల నెట్ అందుకుంది. ఇండియాలో రూ.65.88 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇండియాలో రూ.77.18 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది. ఓవర్సీస్ లో రూ.11.5 కోట్ల వరకు కలెక్షన్లు అందుకుంది. ఇలా తెలుగు స్టేట్స్ లో రూ.64.78 కోట్ల నెట్ అందుకుంది. తమిళంలో రూ.52 లక్షలు, హిందీలో రూ.58 లక్షల వరకు నెట్ అందుకుంది. రేపటితో ఈ చిత్రం నాలుగు వారాల సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకోబోతోంది.

గత నెల ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం ఓటీటీలో కూడా సందడి చేయబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'తండేల్' మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. మార్చి 7 నుంచి ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి తేనుంది. ఈ బ్యూటీఫుల్ లవ్, యాక్షన్ తోపాటు దేశభక్తిని చూపించిన చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. రూ.70 కోట్లతో బన్నీ వాసు నిర్మించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











