Thandel Day 28 Collections : ‘తండేల్’ 28వ రోజు కలెక్షన్లు.. ఇది మరీ దారుణం గురు!

అక్కినేని నాగచైతన్య 'తండేల్' చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి. నేటితో ఈ చిత్రం నాలుగు వారాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కలెక్షన్లు పెద్ద ఎత్తున రాకున్న.... థియేట్రికల్ రన్ ను మాత్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.106 కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ వసూల్ చేసిందని తండేల్ నిర్మాతలు పోస్టర్లు వదిలిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరకు తండేల్ కలెక్షన్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్న లెక్కలు మరోలా ఉన్నాయి. ఈ క్రమంలో డే28న తండేల్ కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.... 'తండేల్' ఫస్ట్ వీక్ లో రూ.49.4 కోట్ల నెట్ అందుకుంది. అందులో తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్లు, తమిళంలో రూ. 0.47 కోట్లు వసూలైంది. సెకండ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.11.3 కోట్ల నెట్ వచ్చింది. తెలుగులో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ వచ్చింది. థర్డ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.4.35 కోట్ల నెట్ అందుకుంది. నిన్నటితో ఈచిత్రం నాలుగో వారం పూర్తి చేసుకుంది. మూడు వారాలు పూర్తయ్యే సరికి ఇండియాలో రూ.65.05 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇందులో తెలుగులో రూ.63.98 కోట్లు, హిందీలో రూ.0.55 కోట్లు, తమిళంలో రూ.0.52 కోట్లు వసూల్ చేసింది.

Sai Pallavi Naga Chaitanya s Thandel Movie Day 28 Box Office collections worldwide

ఇక నాలుగో వారం పూర్తయ్యే సరికి ఇండియాలో మొత్తం రూ.71 లక్షల నెట్ వసూల్ చేసింది. గత వారం కలెక్షన్లతో పోల్చితే ఇది భారీ తక్కువ అయినప్పటికీ థియేట్రికల్ రన్ మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలో డే28న తండేల్ కేవలం రూ.2 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. అది కూడా రెండు తెలుగు స్టేట్స్ లో కలిపి. మరోవైపు హిందీ, తమిళంలో వారం కిందనే కలెక్షన్లు ఆగిపోయాయి. ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లోనే అరాకొరగా వసూళ్లు అందుకుంటోందీ చిత్రం.

నాలుగో వారంలో డే22న రూ.17 లక్షలు, డే23న రూ.25 లక్ష డే24న రూ.24 లక్షల నెట్ అందుకుంది. డే25న రూ.5 లక్షలు, డే26న రూ.5 లక్షలు, డే27న రూ.4 లక్షలు వసూల్ చేసింది. ఇక డే28న మరీ రూ.2 లక్షలకే పరిమితమైంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం.. ఇండియా రూ.88.70 కోట్ల నెట్ అందుకుంది. ఇండియాలో రూ.65.90 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇండియాలో రూ.77.20 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది. ఓవర్సీస్ లో రూ.11.5 కోట్ల వరకు కలెక్షన్లు అందుకుంది. ఇలా తెలుగు స్టేట్స్ లో రూ.64.80 కోట్ల నెట్ అందుకుంది. తమిళంలో రూ.52 లక్షలు, హిందీలో రూ.58 లక్షల వరకు నెట్ అందుకుంది.

Sai Pallavi Naga Chaitanya s Thandel Movie Day 28 Box Office collections worldwide

ఇక ఈ చిత్రానికి 'కార్తీకేయ 2' ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా అదరగొట్టింది. రూ.70 కోట్లతో ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. గీతా ఆర్ట్స్ అధినేత, టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించిన సంగతి తెలిసిందే. లవ్, యాక్షన్, దేశభక్తి మిళితమైన ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X