Thandel Day 29 Collections : ‘తండేల్’ 29వ రోజు కలెక్షన్లు.. ఓటీటీలోకి వచ్చినా ఎంత వసూలైందంటే?
నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్'. ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు ఇంకా కొనసాగుతూనే ఉంది. థియేట్రికల్ రన్ నెలరోజులుగా జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తండేల్ రోజురోజుకు తనకు రావాల్సిన వసూళ్లను మాత్రం రాబడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ థియేట్రికల్ రన్ మాత్రం వీలైనంత వరకు కొనసాగిస్తున్నారు. కాగా డే25 కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.... ఇండియా నెట్ వరకు 'తండేల్' ఫస్ట్ వీక్ లో రూ.49.4 కోట్లు, అందులో తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.53 లక్షలు, తమిళంలో రూ. 47 లక్షలు వసూల్ చేసింది. సెకండ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.11.3 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. తెలుగులో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ వచ్చింది. థర్డ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.4.35 కోట్ల నెట్ ఇండియాలో వసూల్ చేసింది.

ఇక 3వ వారం పూర్తయ్యే సరికి ఇండియాలో రూ.65.05 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇందులో తెలుగులో రూ.63.98 కోట్లు, హిందీలో రూ.55 లక్షలు, తమిళంలో రూ.52 లక్షల నెట్ వసూల్ ను అందుకుంది. 4వ వారంలో డే22న రూ.17 లక్షలు నెట్, డే23న రూ.25 లక్ష డే24న రూ.24 లక్షల నెట్ అందుకుంది. డే25న రూ.5 లక్షలు, డే26న రూ.5 లక్షలు, డే27న రూ.4 లక్షలు వసూల్ చేసింది. ఇక డే28న మరీ రూ.2 లక్షలకే పరిమితమైంది. ఇక డే29 కూడా కేవలం రూ.2 లక్షల నెట్ మాత్రమే వసూల్ చేసింది.
ఈ చిత్రం డే29 వరకు వరల్డ్ వైడ్ గా రూ.88.72 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇండియాలో రూ.65.92 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇండియాలో రూ.77.22 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది. ఓవర్సీస్ లో రూ.11.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. ఇలా తెలుగు స్టేట్స్ లో ఇప్పటి వరకు రూ.64.82 కోట్ల నెట్ అందుకుంది. తమిళంలో రూ.52 లక్షలు, హిందీలో రూ.58 లక్షల నెట్ రాబట్టింది. అయితే తండేల్ మూవీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఈ చిత్రం రూ.106 కోట్ల కలెక్షన్లు సాధించిందని మూడో వారంలోనే ప్రకటించారు. సంబంధిత పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే... ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మార్చి 7న అర్ధరాత్రి 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈమూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ రూ.40 కోట్లకు దక్కించుకోవడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి మరోసారి తన నేచురల్ యాక్టింగ్ తో అలరించింది. రూ.70 కోట్లతో నిర్మించారు. గీతా ఆర్ట్స్ అధినేత, టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. లవ్, యాక్షన్, దేశభక్తి కలగలిపిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











