Thandel Day 30 Collections : ‘తండేల్’ 30వ రోజు కలెక్షన్లు.. నెల రోజుల్లో చైతూ టోటల్ కలెక్షన్లు?
అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్'. చందూ మొండేటి డైరెక్ట్ చేయగా.. రూ.70 కోట్లతో గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పించారు. ప్యూర్ లవ్ అండ్ యాక్షన్, దేశభక్తి మిళితమైన ఈ చిత్రం ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం నెలరోజులుగా థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది.
ఈ సందర్భంగా 'తండేల్' చిత్రం డే30న ఎంత వసూల్ చేసిందనేది చూద్దాం. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.... 'తండేల్' ఫస్ట్ వీక్ లో రూ.49.4 కోట్ల మెరకు ఇండియాలో నెట్ వసూల్ చేసింది. అందులోనూ తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు నెట్, హిందీలో రూ.53 లక్షలు నెట్, తమిళంలో రూ. 47 లక్షలు వసూల్ చేసింది. 2వ వారం పూర్తయ్యే సరికి రూ.11.3 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. తెలుగులో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ సాధించింది.

3వ వారాంతం వరకు మొత్తంగా రూ.65.05 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసింది. ఈ వసూళ్లలో తెలుగులో రూ.63.98 కోట్లు, హిందీలో రూ.55 లక్షలు, తమిళంలో రూ.52 లక్షల నెట్ వసూలైంది. 4వ వారంలో డే22న రూ.17 లక్షలు నెట్, డే23న రూ.25 లక్ష డే24న రూ.24 లక్షలు, డే25న రూ.5 లక్షలు, డే26న రూ.5 లక్షలు, డే27న రూ.4 లక్షలు, డే28న రూ.2 లక్షలు, డే29న కూడా కేవలం రూ.2 లక్షల నెట్ మాత్రమే కలెక్షన్ చేసింది.
ఇక డే30న మరీ లక్ష మాత్రమే కలెక్ట్ చేసింది. అది కూడా తెలుగు స్టేల్స్ లోని ఆయా థియేటర్లలో సాధించింది. ఇలా నెలరోజుల పాటు కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద వసూల్ చేసింది. రెండు వారాలు పూర్తయ్యే సరికి ఈ చిత్రం మంచిగానే వసూళ్లు అందుకుంది. రోజుకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు వసూల్ చేసింది. కానీ కొత్త రిలీజ్ ల కారణంగా మూడో వారం నుంచి అమాంతం పడిపోయింది. రోజుకు కేవలం రూ.5 లక్షల వరకే వసూల్ చేసింది. ప్రస్తుతం ఆ కలెక్షన్ కూడా రూ.లక్షకే పడిపోయింది.

డే30 వరకు వరల్డ్ వైడ్ గా రూ.88.74 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇండియాలో రూ.65.93 కోట్ల నెట్, రూ.77.24 కోట్ల గ్రాస్ ను రాబట్టగలిగింది. ఓవర్సీస్ లో రూ.11.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వసూల్ చేసింది. ఇలా తెలుగు స్టేట్స్ లో డే30 వరకు రూ.64.83 కోట్ల నెట్ అందుకుంది. తమిళంలో రూ.52 లక్షలు, హిందీలో రూ.58 లక్షల నెట్ రాబట్టిన సంగతి తెలిసింది. వారం రోజుల్లోగా తమిళం, హిందీలో పూర్తిగా వసూళ్లు లేవు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా రూ.40 కోట్ల వరకు సంపాధించింది. ఇలా మొత్తంగా రూ.106 కోట్లకు పైగానే గ్రాస్ వసూల్ చేసిందని సెకండ్ వీక్ పూర్తవ్వగానే అధికారిక ప్రకటన వెలువడింది. ఇక తండేల్ మార్చి 7 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











