Thandel Day 31 Collections : ‘తండేల్’ 31వ రోజు కలెక్షన్లు.. నెల దాటినా ఎంత వసూల్ చేసిందంటే?

నాగచైతన్య - సాయిపల్లవి నటించిన 'తండేల్' చిత్రం నెలరోజులుగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది. 'కార్తీకేయ 2' డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అటు ప్రేక్షకులను అలరించడంతో పాటు.. బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్లతో అదరగొడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.106 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసిందని పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. 'తండేల్' ఫస్ట్ వీక్ లో రూ.49.4 కోట్ల మెరకు ఇండియా నెట్ వసూల్ చేసింది. వీటిలో తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు నెట్, హిందీలో రూ.53 లక్షలు నెట్, తమిళంలో రూ. 47 లక్షలు వసూల్ చేసింది. 2వ వారం పూర్తయ్యే సరికి రూ.11.3 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. తెలుగులో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ రాబట్టింది. ఇక మూడో వారం నుంచి పెద్దగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫామ్ చేయలేదు.

Sai Pallavi Naga Chaitanya s Thandel Movie Day 31 Box Office collections worldwide

3వ వారంలో వసూళ్లు ఇలా ఉన్నాయి. థర్డ్ వీక్ వరకు మొత్తంగా రూ.65.05 కోట్ల వరకు ఇండియా నెట్ అందుకుంది. తెలుగులో రూ.63.98 కోట్లు, హిందీలో రూ.55 లక్షలు, తమిళంలో రూ.52 లక్షల నెట్ రాబట్టింది. 4వ వారంలో డే22న రూ.17 లక్షలు నెట్, డే23న రూ.25 లక్షలు, డే24న రూ.24 లక్షలు, డే25న రూ.5 లక్షలు, డే26న రూ.5 లక్షలు, డే27న రూ.4 లక్షలు, డే28న రూ.2 లక్షలు, డే29న కూడా కేవలం రూ.2 లక్షల నెట్, డే30న కేవలం రూ.1లక్ష వసూల్ చేసింది.

కాగా, డే31న ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో రూ.5లక్షల వరకు వసూళ్లు అందుకుంది. దీంతో ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.88.74 కోట్ల గ్రాస్, ఇండియాలో రూ.65.93 కోట్ల నెట్, రూ.77.24 కోట్ల గ్రాస్ ను రాబట్టగలిగింది. ఓవర్సీస్ లో రూ.11.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అందాయి. ఇలా తెలుగు స్టేట్స్ లో డే31 వరకు రూ.64.88 కోట్ల నెట్ వసూల్ చేసుకుంది. ప్రస్తుతం పెద్దగా వసూళ్లు లేకున్నా వచ్చిన కాడికి అందుకుంటోంది.

ఇక ఓవైపు 'తండేల్' ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ థియేటర్ లో అత్యల్పంగా ఆక్యుపెన్సీని సాధిస్తోంది. కొద్దిపాటి థియేటర్లలో వచ్చిన వసూళ్లను బాక్సాఫీస్ నుంచి రాబట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని రూ.70 కోట్లతో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పించారు. ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మార్చి 7నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్యూర్ లవ్, దేశ భక్తి, యాక్షన్ మిళితమైన ఈ చిత్రానికి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అలాగే నాగచైతన్య కెరీర్ లోనే ఈ మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. దేవీశ్రీ అందించిన సంగీతం ఇప్పటికీ మారుమోగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X