twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Pallavi's Virata parvam day 1 Collections.. సాయి పల్లవి మ్యాజిక్ పనిచేసిందా? తొలి రోజు ఎంత వసూలంటే?

    |

    లేడి పవర్ స్టార్ సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో డీ సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా రూపొందించిన విరాట పర్వం, అలాగే గోపి గణేష్ దర్శకత్వంలో యువ హీరో సత్యదేవ్ నటించిన గాడ్సే చిత్రం జూన్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాల టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగాయి. దాంతో ఈ రెండు సినిమాలపై మంచి ఆసక్తి నెలకొన్నది. ఈ క్రమంలో విరాట పర్వం, గాడ్సే చిత్రాల తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

    విరాట పర్వం ప్రీ రిలీజ్ బిజినెస్

    విరాట పర్వం ప్రీ రిలీజ్ బిజినెస్

    విరాట పర్వం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 4 కోట్లు, సీడెడ్‌లో 2 కోట్లు, ఆంధ్రాలో 5 కోట్ల బిజినెస్‌తో మొత్తంగా 11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలుపుకొని 1 కోటి, ఓవర్సీస్‌లో 2 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం 14.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా బాక్సాఫీస్ ప్రయాణం చేపట్టింది.

    ఏపీ, తెలంగాణలో

    ఏపీ, తెలంగాణలో

    ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లైన హైదరాబాద్, వైజాగ్, వరంగల్, విజయవాడ, గుంటూరు తదితర నగరాల్లో విరాట పర్వం సినిమాకు భారీ స్పందన కనిపించింది. ఈ చిత్రం సాయంత్రం ఫస్ట్ షో వరకు హైదరాబాద్‌లో 32 లక్షలు, వైజాగ్‌లో 3 లక్షలు, వరంగల్‌లో 4 లక్షలు, విజయవాడలో 2.50 లక్షలు వసూలు చేసింది. దాంతో చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

    కర్ణాటక, తమిళనాడులో

    కర్ణాటక, తమిళనాడులో

    ఇక కర్ణాటక, తమిళనాడులో ఓ మోస్తారు స్పందన విరాట పర్వం సినిమాకు వ్యక్తమైంది. ఈ చిత్రం బెంగళూరులో 4 లక్షలు, చెన్నైలో 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, చెన్నైతో కలిపి ఈ చిత్రం సుమారు 80 లక్షల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్‌ రూపంలో వసూలు చేసింది.

    తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో


    ఇక అడ్వాన్స్ బుకింగ్ విషయం పక్కన పెడితే.. కరెంట్ బుకింగ్‌కు పలు ప్రాంతాల్లో భారీ స్పందన కనిపించింది. ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు నమోదయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తొలి రోజున 40 నుంచి 50 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా


    విరాట పర్వం సినిమాకు సంబంధించి ఓవర్సీస్ వసూళ్ల విషయానికి వస్తే.. ముఖ్యంగా అమెరికాలో ఓ మోస్తారు వసూళ్లను సాధించింది. 171 లోకేషన్లలో 19k డాలర్లను తొలి రోజున రాబట్టింది. ప్రీమియర్లతో కలిపి ఈ చిత్రం 75k డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. దాంతో చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల షేర్, 4 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్ట వచ్చని అంచనా వేస్తున్నారు.

    గాడ్సే కలెక్షన్ల అంచనా

    గాడ్సే కలెక్షన్ల అంచనా


    గాడ్సే సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి రోజున 30 శాతం అక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 30 లక్షల రూపాయల షేర్, 70 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్‌లో వివరాలు అందాల్సి ఉన్నాయి.

    గాడ్సే బ్రేక్ ఈవెన్

    గాడ్సే బ్రేక్ ఈవెన్


    ఇదిలా ఉండగా, గాడ్సే చిత్రం నైజాంలో 1.3 కోట్లు, సీడెడ్‌లో 40 లక్షలు, ఆంధ్రాలో 1.8 కోట్లతో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటక, ఓవర్సీస్ లో కలిపి 1 కోటి రూపాయల బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 4.5 కోట్ల మేర బిజినెస్ నమోదు చేయగా.. 5 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది.

    English summary
    ాాSai Pallavi's virata parvam, and Satya Dev's Godse movies released on June 17th. Here is the estimated collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X