Amaran Overseas Collections: ఓవర్సీస్‌లో అమరన్ ‘శివ’తాండవం.. సాయిపల్లవి రికార్డుల మోత.. ఎన్ని కోట్లంటే?

స్టార్ హీరో, హీరోయిన్లు శివ కార్తీకేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నది. ఈ చిత్రం దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా కలెక్షన్లపరంగా వసూళ్లు రాబడుతున్నది. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్‌పై రూపొందించిన ఈ సినిమాకు రాజకుమార్ పెరియార్ దర్వకత్వం వహించారు. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అమరన్ చిత్రం ఉత్తర అమెరికాలో రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. అమెరికా, కెనడాలో కలిపి ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా 150K డాలర్లు, తొలి రోజు 100K, రెండో రోజు 200K డాలర్లు, మూడో రోజు 300K డాలర్లు వసూలు చేసింది. నాలుగో రోజు తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 8.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

Sai Pallavi s Amaran movie Overseas box Office Collections Sivakarthikeyan breaking records

ఫ్రాన్స్‌లో అమరన్ చిత్రం ది గోట్, వెట్టియన్ సినిమాలను ధీటుగా కలెక్షన్లను రాబడుతున్నది. రజనీ, విజయ్ సినిమాలకు మించి రెస్పాన్స్ సొంతం చేసుకొంటున్నది. ఈ సినిమా తొలి రోజు 3 వేల ఫుట్ ఫాల్స్, 2వ రోజున 4500 ఫుట్ ఫాల్స్, మూడో రోజున 3800 ఫుట్‌ఫాల్స్‌ను నమోదు చేసుకొన్నది. మొత్తంగా 12 వేల ఫుట్‌ఫాల్స్‌ను నమోదు చేసుకొన్నది.

ఇక అమరన్ చిత్రం సింగపూర్‌లో భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. తొలివారాంతంలో ఈ చిత్రం 700K సింగపూర్ డాలర్లను వసూలు చేసింది. ఈ సినిమా శివకార్తీకేయన్ కెరీర్‌లోనే అత్యధికంగా వసూళ్లను రాబట్టింది. విజయ్ నటించిన ది గోట్, శివ కార్తీకేయన్ నటించిన డాన్ సినిమాకు మించి వసూళ్లను రాబట్టడం విశేషంగా మారింది.

Sai Pallavi s Amaran movie Overseas box Office Collections Sivakarthikeyan breaking records

అమరన్ చిత్రం గల్ఫ్ కంట్రీలో కూడా భారీగా వసూళ్లను రాబడుతున్నది. తొలి వారాంతంలో ఈ చిత్రం 43000 ఫుట్‌ఫాల్స్‌తో మొత్తంగా 500K డాలర్లను, గల్ఫ్ కంట్రీస్‌లో 68 వేల ఫుట్‌ఫాల్స్‌తో 700K డాలర్లు వసూలు చేసింది. గతంలో శివ కార్తీకేయన్ నటించిన డాక్టర్ చిత్రం 630K డాలర్లు వసూలు చేయగా.. ఆ రికార్డును అధిగమించింది.

ఇండియాలో అమరన్ చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం ఫస్ట్ డే నాడు 22 కోట్లు, రెండో రోజు 20 కోట్ల రూపాయలు, 3వ రోజు 21 కోట్ల రూపాయలు, 4వ రోజు 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం 83 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక 5వ రోజు ఈ సినిమా 7 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 90 కోట్ల మేర కలెక్షన్లు రాబడుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఇండియాలో 100 కోట్ల వసూలు చేసిన ఘనతను ఈ సినిమా సొంతం చేసుకొంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 150 కోట్ల రూపాయల మేర కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X