మొదటివారం రోజుల్లో 'రాక్షసుడు'.. కలెక్షన్ రిపోర్ట్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా రమేష్ శర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాక్షసుడు'. ఆగస్టు 2 వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకొని రెండో వారంలో అడుగుపెట్టింది.
ఈ సినిమాకి ఫస్ట్ డే మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయి. మొదటి రోజు డీసెండ్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా తొలివారం పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 8.77 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో తొలివారం హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో చిత్రంగా నిలిచింది. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన అల్లుడు శీను, జయ జానకి నాయిక, సాక్ష్యం సినిమాలు ఈ సినిమా కంటే ముందున్నాయి.

ఇక ఏరియా వైస్ కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. నైజాం: రూ. 3.15 కోట్లు, సీడెడ్ రూ. 1.07 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.12 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 58 లక్షలు, కృష్ణ రూ. 61లక్షలు, గుంటూరు రూ. 61 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 44 లక్షలు, నెల్లూరు రూ. 24లక్షలు వసూలైంది. రెస్టాఫ్ ఇండియా రూ. 65 లక్షలు, ఓవర్సీస్ రూ. ౩౦ లక్షలు రాబట్టింది రాక్షసుడు మూవీ.
ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 14 కోట్లకు అమ్మారు. అంటే మరో 6 కోట్లు వసూలైతే సినిమా లాభాల్లోకి వస్తుంది. ఫుల్ రన్‌లో అందరు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌గా బయట పడే అవకాశముందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











