NTR 30: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. మరీ అంత తక్కువనా?
RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక ఇందులో సైఫ్ అలీ ఖాన్ ఒక పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సైఫ్ ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రతినాయకుడుగా సైఫ్: ఎన్టీఆర్ 30వ సినిమా కోసం వేసిన ఐలాన్ సెట్ లో షూటింగ్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రతినాయకుడుగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కూడా మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. తారక్, సైఫ్ ఆలీఖాన్ కాంబినేషన్ లో యాక్షన్ సీక్వెన్స్, టాకీ పార్ట్ ని ఈ షెడ్యూల్ లో కొరటాల ఫినిష్ చేయనున్నారు.

సైఫ్ రెమ్యునరేషన్ ఎంత?: ఇక జాన్వీ కపూర్ కూడా ఈ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సైఫ్ ఆలీఖాన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే ప్రశ్న టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం మూవీ కోసం సైఫ్ ఆలీఖాన్ కేవలం 12 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారంట. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు కూడా అతను దాదాపు అదే రేంజ్ లో తీలుకున్నట్లు టాక్.
ఎందుకంత తక్కువ అంటే..: ఒకప్పుడు హిందీలో హీరోగా సైఫ్ మంచి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. నిజానికి హిందీలో సైఫ్ ఆలీఖాన్ కి మంచి మార్కెట్ ఉంది. హీరోగా 15 కోట్లకి పైగానే అతను రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ 30 మూవీకి మాత్రం 10 నుంచి 12 కోట్ల తీసుకోవడానికి కారణం ఉందట. ఈ సినిమాకి రెమ్యునరేషన్ తో పాటు రిలీజ్ తర్వాత హిందీ వెర్షన్ లాభాలలో వాటా ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారంట.

హిందీ మార్కెట్ టార్గెట్: RRR సినిమాతో తారక్ కి బాలీవుడ్ లో కూడా మార్కెట్ స్కోప్ పెరిగింది. దాంతో పాటు సైఫ్ ఆలీఖాన్, జాన్వీ కపూర్ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ కారణంగా హిందీ బెల్ట్ లో మూవీకి మంచి ప్రాఫిట్స్ వస్తాయని భావిస్తున్నారు. తద్వారా మరికొంత అదనంగా వచ్చే ఛాన్స్ ఉందని సైఫ్ ఆలీఖాన్ ఫిక్స్ అయ్యి ఈ రెమ్యునరేషన్ కి ఒప్పుకున్నారంట.

హిట్టయితే ఆ రేంజ్ లో రావచ్చు: ప్రాఫిట్ షేర్ తో కలిసి అతనికి ఎన్టీఆర్ 30 ద్వారా పది నుంచి పదిహేను కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట. ఇక సైఫ్ అలీ ఖాన్ గత కొంత కాలంగా హీరోగా అయితే పెద్దగా సక్సెస్ కావడం లేదు. ప్రస్తుతం విలన్ పాత్రలు చేసుకుంటు వెళుతున్నాడు. ఇక NTR 30వ సినిమా కూడా నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నారట. మరి ఈ సినిమా అతనికి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











