Saindhav Closing Collections వెంకటేష్ మూవీ హిట్టా? ఫట్టా? సైంధవ్‌కు ఎన్ని కోట్ల నష్టమంటే?

హిట్ మూవీ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మాతగా రూపొందించిన చిత్రం సైంధవ్. వెంకటేష్ దగ్గుబాటి కెరీర్‌లో 75వ చిత్రంగా రూపొందిన మూవీలో నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు నటించారు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రిరీలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సైంధవ్ సినిమాను అగ్ర నటులు, టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తో సహకారంతో రూపొందించారు. ప్రమోషనల్ ఖర్చులతో సహా ఈ సినిమా కోసం సుమారుగా 55 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ 28 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

 Saindhav Box Office Closing Collections Worldwide: Venkatesh Movie Box Office Report here

సైంధవ్ సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాం థియేట్రికల్ హక్కులు 8 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 4 కోట్లు, ఆంధ్రాలో 9 కోట్ల రూపాయలు బిజినెస్‌తో కలిపి.. మొత్తంగా 21 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2.5 కోట్లు, ఓవర్సీస్ బిజినెస్ 4.5 కోట్ల రూపాయల మేర జరిగింది. మొత్తంగా 28 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

 Saindhav Box Office Closing Collections Worldwide: Venkatesh Movie Box Office Report here

సైంధవ్ చిత్రం తొలి రోజు 5.5 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. అయితే సంక్రాంతి బరిలో దూకిన సినిమాలతో పోటీ పడలేక బాక్సాఫీస్ వేటలో వెనుక పడింది. తొలివారంలో ఎఫ్టెక్టివ్‌గా కలెక్షన్లు సాధించకలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా నష్టాల్లో ముగిసిందని తెలిపారు.

సైంధవ్ చిత్రం ఆంధ్ర ప్రదేశ్‌లో ఓ మోస్తారు కలెక్షన్లు వసూలు చేసింది. నైజాం, ఆంధ్రాలో కలిపి ఈ సినిమా 15 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా డిస్టిబ్యూటర్లకు నష్టం కలిగించినా.. ఈ చిత్రం నిర్మాతకు లాభాలనే పంచిపెట్టింది.

 Saindhav Box Office Closing Collections Worldwide: Venkatesh Movie Box Office Report here

ప్రపంచవ్యాప్తంగా సైంధవ్ థియేట్రికల్ రన్‌ను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 19 కోట్ల గ్రాస్ వసూళ్లతో థియేట్రికల్ రన్ ముగించింది. 28 కోట్ల టార్గెట్‌తో మొదలుపెట్టి.. సుమారుగా 17 కోట్ల నికర కలెక్షన్లను నమోదు చేసింది. అయితే థియేట్రికల్‌గా భారీ నష్టాలు వాటిల్లినప్పటికీ.. నాన్ థియేట్రికల్‌గా నిర్మాతకు టేబుల్ ఫ్రాఫిట్ సంపాదించిపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X