Saindhav Box Office Collections సైంధవ్ హిట్టా? ఫట్టా? వెంకటేష్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో 75వ చిత్రంగా రూపొందిన సైంధవ్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రద్దా శ్రీనాథ్, అండ్రియా జెర్మియా, రుహనీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, ముఖేష్ రుషి, జితు సేన్ గుప్తా, జయప్రకాశ్ తదితరులు నటించిన ఈ సినిమా జనవరి 13వ తేదీన రిలీజైంది. హిట్ 1, హిట్ 2 సినిమాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ వివరాలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Recommended Video

Saindhav Boxoffice Collections హిట్టా? ఫట్టా? Venkatesh మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే? | FilmiBeat

సైంధవ్ సినిమాలో నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ, ముఖేష్ రుషి, శ్రద్దా శ్రీనాథ్, అండ్రియా, రుహానీ శర్మ లాంటి నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ దాదాపు 75 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమా బజ్ క్రియేట్ కావడంతో భారీగా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా జరిగింది.

Saindhav Day 1 Expected Box Office Collections worldwide: Venkatesh Movie Gets best numbers in Telugu States

సైంధవ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం రైట్స్‌ను 8 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 4 కోట్ల రూపాయలు, ఆంధ్రా హక్కులు 9 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సుమారుగా 21 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకొన్నది. ఓవర్సీస్ రైట్స్ 4.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల 2.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

సైంధవ్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ తదితర ప్రమోషనల్ కంటెంట్‌కు బజ్ క్రియేట్ కావడంతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మేర బిజినెస్ జరిగింది. బిజినెస్‌కు తగినట్టుగానే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 1100 స్క్రీన్లలో విడుదల చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Saindhav Day 1 Expected Box Office Collections worldwide: Venkatesh Movie Gets best numbers in Telugu States

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో ఎమోషనల్ కంటెంట్ మిళితం చేసి రూపొందించిన సైంధవ్ చిత్రానికి పాజిటివ్ రెస్సాన్స్ లభించింది. మార్నింగ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 50 శాతానికి పైగా, అలాగే సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. విజయవాడలో 70 శాతం, వరంగల్‌లో 60 శాతం, గుంటూరులో 80 శాతం, కాకినాడలో 70 శాతం ఆక్యుపెన్సీ సాధించింది.

Saindhav Day 1 Expected Box Office Collections worldwide: Venkatesh Movie Gets best numbers in Telugu States

సైంధవ్ సినిమా రోజు వారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో సైంధవ్ చిత్రం 4 కోట్లకుపైగా నికరంగా, 7 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి 1 కోటి రూపాయల షేర్, 2 కోట్ల గ్రాస్ అలాగే ఈ సినిమా ఓవర్సీస్‌లో 1.5 కోట్ల షేర్, 3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా మొదటి రోజు 8 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Saindhav 2వ రోజు కలెక్షన్లు
సైంధవ్ మూవీ 2వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నిలకడగానే వసూళ్లను సాధించింది. రెండో రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.8 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 50 లక్షలు, ఓవర్సీస్‌లో ఈ సినిమా 50 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండో రోజు మొత్తంగా 2.8 కోట్లు నికరంగా 4 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X