Saindhav Day 3 Collections వెంకటేష్ 75వ మూవీ కలెక్షన్ల పరిస్థితి ఏంటి? సైంధవ్‌కు ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో 75వ చిత్రంలో నటించిన సైంధవ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్ బోయనపల్లి నిర్మాతగా హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు నటించారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన లభిస్తున్నదనే వివరాల్లోకి వెళితే..
సైంధవ్ చిత్రం ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 75 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ మొత్తంగా 28 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సుమారుగా 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా ఈ సినిమా బక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

సంక్రాంతి రేసులో కీలకమైన సినిమాగా వచ్చిన తరుణంలో స్క్రీన్లు, థియేటర్ల కేటాయింపు వివాదంగా మారడంతో ఈ సినిమాకు పరిమితమైన థియేటర్లు లభించాయనే విషయం చర్చగా మారింది. దాంతో ఈ సినిమా 500 స్క్రీన్లను ఏపీ, నైజాంలో సొంతం చేసుకోగా.. వరల్డ్ వైడ్ ఈ సినిమా 1100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
సంక్రాంతి సినిమాల మధ్య భారీ పోటీ ఉన్నప్పటికీ.. సైంధవ్ మూవీ ఓ మాదిరి వసూళ్లను సాధించింది. ఈ సినిమాపై మిక్స్‌డ్ రివ్యూలు ఉన్నప్పటికీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.1 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 5.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక సైంధవ్ సినిమా రెండో రోజు అదే జోష్‌ను కొనసాగించలేకపోయిందనే కలెక్షన్లు వెల్లడించాయి. W ఈ మూవీ రెండో రోజు 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో రెండు రోజుల్లో ఈ సినిమా 9.5 కోట్లు వసూలు చేసింది.
ఇదిలా ఉండగా, సైంధవ్ సినిమా 3వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేదనేది ప్రాథమిక సమాచారం. ఈ చిత్రం 3వ రోజు 1.5 కోటి రూపాయల షేర్, 3 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











