»   » పూరి జగన్నాథ్,దేవిశ్రీ ప్రసాద్, గోపిచంద్ ,శర్వానంద్ తలో చెయ్యేసి మరీ...

పూరి జగన్నాథ్,దేవిశ్రీ ప్రసాద్, గోపిచంద్ ,శర్వానంద్ తలో చెయ్యేసి మరీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సాయిరామ్‌ శంకర్‌ హీరోగా సుదర్శన్‌ సలేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నేనోరకం'. శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రేష్మి మేనన్‌ హీరోయిన్ . దేపా శ్రీకాంత్‌ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 17న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిత్‌ నారాయణ్‌ స్వరపరిచిన ఇందులోని పాటలను త్వరలోనే పూరి జగన్నాథ్,దేవిశ్రీ ప్రసాద్, గోపిచంద్ ,శర్వానంద్ ఒక్కొక్కరిగా ఒక్కొక్క పాటను త్వరలో ఆవిష్కరించబోతున్నారు.

ఈ సందర్భంగా హీరో సాయిరామ్‌శంకర్‌ మాట్లాడుతూ.. అందరినీ ఆలోచింపజేసే కథ, కథనాలతో సాగుతుందని అన్నారు. నేటి పరిస్థితులను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోందన్నారు. అలాగే ''నేనో రకం' అనే టైటిల్‌ మా ఈ సినిమాకు కరెక్ట్‌గా యాప్ట్‌. ఆడియెన్స్‌ను అలరించటంతో పాటు, ఆలోచింపజేలా ఉంటుంది. కాంటెపరరీ ఇష్యూస్‌పై ఈ సినిమాను తీశాం'' అని తెలిపారు.

Sairam Shankar's Neno Rakam confirmed for 17th March

శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ ''గత కొంత కాలంగా సౌత్‌లో అందులోనూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. నేనోరకం కూడా అదే కొవలో వస్తున్న ట్రెండీ మూవీ. దర్శకుడి కధ, కధనమే ఈ సినిమాకు హైలైట్‌'' అని అన్నారు.

దర్శకుడు సుదర్శన్‌ మాట్లాడుతూ '' మహిత్‌ అందించిన పాటలను త్వరలోనే విడుదల చేయబోతున్నాం. టైటిల్‌కు తగ్గట్టే సరికొత్త ట్రీట్‌మెంట్‌తో సినిమా రూపొందించాం. సాయిరామ్‌ శంకర్‌ నటన కొత్త థ్రిల్‌ను కలిగిస్తుంది' అని తెలిపారు. అలాగే మహిత్ అందించిన పాటలను టాప్ సెలబ్రెటీస్ త్వరలో ఆవిష్కరించబోతున్నారు. "నేనోరకం" టైటిల్ కు తగ్గట్టుగానే సరికొత్త ట్రీట్ మెంట్ తో సినిమా రూపొందించటం జరిగింది. సాయిరామ్ శంకర్ -శరత్ కుమార్ ల నటన ,వారిద్దరి మధ్య వచ్చె సన్నివేశాలు ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను కలుగచేస్తాయన్నారు.

నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... మా సంస్థ ద్వారా వస్తొన్న తొలి చిత్రన్నె ఓ సరికొత్త కమర్షియల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ఆడియోన్స్ తో పాటు, క్రిటిక్స్ ను కూడా అలరించెలా ఈ సినిమాను సిద్దం చేయటం జరిగింది. మార్చి 17న సినిమా విడుదలవుతుందన్నారు. రేష్మి మీనన్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ఆదిత్య మీనన్‌, కాశీ విశ్వనాథ్‌, పృధ్వీ, వైవాహర్ష, జబర్దస్త్‌ టీమ్‌ తదితరులు నటిస్తున్నారు.

English summary
'Neno Rakam' that stars Sairam Shankar as lead hero and Sharath Kumar in a prime role has confirmed its release date - 17th March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu