Saiyaara Closing Collection: సైయారా క్లోజింగ్ కలెక్షన్స్.. 60 కోట్లతో తీస్తే ఎన్ని వందల కోట్ల లాభమంటే?
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై అక్షయ్ విధాని నిర్మించిన ప్రేమ కథా చిత్రం సైయారా. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా సమర్పకుడిగా వ్యవహరించారు. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సైయారాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు అహన్ పాండే హీరోగా నటించగా.. అనీత్ పడ్డా హీరోయిన్‌గా నటించింది. గీతా అగర్వాల్ శర్మ, రాజేష్ కుమార్, వరుణ్ బడోలా, షాద్ రంధావా, ఆలం ఖాన్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ, మిథున్ శర్మ, సచతె టాండడన్, పరంపర థాకూర్ స్వరాలు అందించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా పనిచేశారు. టీజర్, ట్రైలర్లతో అంచనాలను పెంచేసిన సైయారా చిత్రం మోహిత్ సూరికి హిట్‌ను అందించిందా? ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..

సైయారా బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార వ్యయంతో కలిపి సైయారా సినిమాను దాదాపు 60 కోట్ల బడ్జెట్ అయ్యింది. విడుదలకు ముందే పాటలతో ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. భారీ అంచనాల నేపథ్యలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8000 స్క్రీన్లలో సైయారాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. మోహిత్ సూరి సినిమాల లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల షేర్.. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.
సైయారా కలెక్షన్స్
సైయారా కలెక్షన్లలోకి వెళితే.. ఇండియా వైడ్‌గా తొలి రోజు 22 కోట్లు రూపాయలు, 2వ రోజున 26 కోట్లు, 3వ రోజున 36 కోట్ల రూపాయలు, 4వ రోజున 24 కోట్ల రూపాయలు, 5వ రోజున 25 కోట్ల రూపాయలు, 6వ రోజున 22 కోట్ల రూపాయలు, 7వ రోజున 19 కోట్ల రూపాయలు చొప్పున తొలి వారం 175 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారం ఇండియా వైడ్‌గా 110 కోట్లు, మూడో వారంలో 29 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 14 కోట్ల రూపాయలు రాబట్టింది. మొత్తంగా 33 రోజుల వరకు సైయారా మూవీకి ఇండియా వైడ్‌గా 327 కోట్ల రూపాయల నెట్, 392 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.
సైయారా ఓవర్సీస్ కలెక్షన్స్
సైయారా చిత్రానికి ఓవర్సీస్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. హిందీ సినిమాకు స్ట్రాంగ్ బేస్‌గా ఉన్న నార్త్ అమెరికాలోని భారతీయ యువత పాటు విదేశీయులకు ఈ ప్రేమకథ బాగా నచ్చేసింది. అమెరికా, కెనడాలలో సైయారాకు భారత్‌తో సమానంగా వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో సైయారా 6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 53 కోట్ల రూపాయలు) కలెక్షన్స్ రాబట్టింది. తద్వారా నార్త్ అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ రొమాంటిక్ మూవీగా సైయారా నిలిచింది. మొత్తంగా 34 రోజుల వరకు సైయారా మూవీ ఓవర్సీస్‌లో 158 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి సైయారా మూవీకీ వరల్డ్ వైడ్‌గా 550 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
సైయారాకు లాభమెంత? నష్టమెంత?
ఓ మాదిరి అంచనాలు తప్పించి పెద్దగా ఎవరికీ నమ్మకం లేని సైయారా ఈ స్థాయిలో వసూళ్లను రాబడుతుందని ఎవరూ అనుకోలేదు. గత వారం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ.. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల వార్ 2 సినిమా వచ్చే వరకు సైయారా ఎదురు లేకుండా సాగింది. 600 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంతా భావిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం ఆ పరిస్ధితులు కనిపించడం లేదు.
దుమ్మురేపే కలెక్షన్స్‌తో ట్రేడ్ పండితుల్ని సైతం ఈ సినిమా ఆశ్చర్యపరిచింది. 60 కోట్ల రూపాయల షేర్ టార్గెట్‌ను కేవలం తొలి వారమే కొట్టిపడేసి లాభాల బాట పట్టింది ఈ సినిమా. నాటి నుంచి అన్ని ఏరియాలలో తన హవా చూపించిన సైయారా చిత్రం 34 రోజుల వరకు ఏకంగా 290 కోట్ల రూపాయల లాభాలను అందించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇవికాక థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాతకు లాభాల పంట పండించింది సైయారా.


Click it and Unblock the Notifications











