Saiyaara Day 1 Box Office: సైయారా మూవీకి రికార్డు వసూళ్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆషికి 2 ఫేమ్ డైరెక్టర్ మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సైయారా. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు ఆహాన్ పాండే, సలాం వెంకీ ఫేమ్ అనీత్ పడ్డా జంటగా రూపొందిన ఈ సినిమా పాటలు ఇప్పటికే పాపురల్ అయ్యాయి. ఆదిత్య చోప్రా సమర్పకుడిగా, అక్షయ్ విధాని నిర్మాతగా రూపొందిన ఈ సినిమా జూలై 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది.
సైయారా సినిమాకు ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ,మిథున్ శర్మ, సచతె టాండడన్, పరంపర థాకూర్ పాటలు అందించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రఫిని, రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా వ్యవ్యహరించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
సైయారా సినిమాను నేటి జనరేషన్‌కు తగినట్టుగా రిచ్‌గా, క్వాలిటీ కంటెంట్‌తో రూపొందించారు. ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా భారీగా ఖర్చు చేశారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 60 కోట్ల రూపాయల మేర అయింది. ఈ సినిమా 120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబడితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ క్రాస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సైయారా సినిమా టైలర్, ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ స్పందన రావడంతో మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రంపై పెరిగిన అంచనాలకు తగినట్టుగా వరల్డ్ వైడ్‌గా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓ కొత్త జంట సినిమాను ఈ రేంజ్‌లో రిలీజ్ చేయడం బాలీవుడ్‌లో అరుదైన విషయంగా చెప్పుకొంటున్నారు. ఇక ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ కూడా నమోదైంది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
అయితే ఈ సినిమా ట్రేడ్ వర్గాల అంచనాలను మించి కలెక్షన్లను సాధించినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా సుమారుగా 22 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక కొత్త నటీనటులతో ఈ రేంజ్‌లో రికార్డు కలెక్షన్లను సాధించడం విశేషంగా మారింది. ఈ సినిమా తొలి వారం ముగిసే సమయానికి 100 కోట్లకు చేరువ అయ్యే అవకాశం లేకపోలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో అంటే.. 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో వికీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఛావా, సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన సికందర్, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హౌస్‌ఫుల్ 5 సినిమాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఛావా 29 కోట్ల రూపాయలు, సికందర్ 25 కోట్లు, హౌస్‌ఫుల్ 5 సినిమా 21 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ప్రస్తుతం సైయారా చిత్రం అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రాన్ని మించి కలెక్షన్లు రాబట్టడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను తెలియజెప్పింది.


Click it and Unblock the Notifications











