Saiyaara Box Office Collections: 400 కోట్లకు చేరువగా సైయారా.. అమీర్, అక్షయ్, ఛావా రికార్డులు బ్రేక్

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆషికి 2 ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సైయారా. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు ఆహాన్ పాండే, సలాం వెంకీ ఫేమ్ అనీత్ పడ్డా జంటగా రూపొందిన ఈ సినిమా పాటలు ఇప్పటికే పాపురల్ అయ్యాయి. ఆదిత్య చోప్రా సమర్పకుడిగా, అక్షయ్ విధాని నిర్మాతగా రూపొందిన ఈ సినిమా జూలై 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. సైయారా మూవీని వీక్షించిన మహేష్ బాబు ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. సైయారా టీమ్‌కు తలవంచి అభినందనలు తెలియజేస్తున్నాను. నిజాయితీగా, అందంగా ఈ సినిమా కథను చెప్పిన విధానం బాగుంది. కథను నడిపించిన విధానం, పాత్రల్లో నటులు జీవించిన విధానం అద్బుతంగా ఉన్నాయి అని కామెంట్ చేశారు.

సైయారా సినిమాకు ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ,మిథున్ శర్మ, సచతె టాండన్, పరంపర థాకూర్ పాటలు అందించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రఫిని, రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా వ్యవ్యహరించారు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, సన్నివేశాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ మూవీపై భారీ అంచనాలు పెంచేలా చేశాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు చేసిన ట్వీట్ ఈ సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేసింది. గత 5 రోజులుగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన కలెక్షన్ల తుఫాన్ వివరాల్లోకి వెళితే..

Saiyaara Day 11 Box Office

సైయారా సినిమాను యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా, మ్యూజికల్ హిట్‌కు కావాల్సిన హంగులతో రూపొందించారు. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేశారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య 8000 స్క్రీన్లలో థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ మూవీకి భారీ రెస్పాన్స్ రావడంతో 10000 స్క్రీన్లకు పెంచారు. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 60 కోట్ల షేర్.. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సైయారా చిత్రం మాస్, క్లాస్ ఆడియెన్స్ అండతో తొలి రోజు నుంచే భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా మొదటి రోజు 21.5 కోట్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఆ తర్వాత 26 కోట్లు, 35.75 కోట్లు, 24 కోట్ల రూపాయల కలెక్షన్లతో కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. అంతటితో ఆగకుండా ఈ సినిమా తొలివారం 175 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక రెండో వారంలో ఈ మూవీ వసూళ్ల వరద పారింది. 8వ రోజున 18 కోట్ల రూపాయలు, 9వ రోజున 26.5 కోట్ల రూపాయలు, 10వ రోజున 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 250 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లను కేవలం ఇండియాలోనే రాబట్టింది. ఈ సినిమా 11వ రోజు 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు. ఈ చిత్రం ఇండియాలో 260 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను వసూల చేసే అవకాశం ఉంది.

ఇక చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఇప్పటి వరకు నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ కంట్రీస్‌లో కలిపి ఈ చిత్రం 80 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాల 260 కోట్ల రూపాయల నెట్, 300 కోట్ల రూపాయల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 377 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా త్వరలోనే 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఈ సినిమా ఓవర్సీస్‌లో ఛావా, హౌస్‌ఫుల్ 5, సితారే జమీన్ పర్ సినిమాల వసూళ్లను అధిగమించింది. కొత్త నటీనటులు సీనియర్ స్టార్స్ అమీర్, అక్షయ్, వికీ కౌశల్ రికార్డులను బ్రేక్ చేయడం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X