Saiyaara Day 16 Collections: సైయారా కలెక్షన్ల సంచలనం.. ఛావా రికార్డ్ బ్రేక్..ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్ధ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ప్రేమ కథా చిత్రం సైయారా. ఆహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించగా.. మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. అక్షయ్ విధాని ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఆదిత్య చోప్రా సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 18న గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే 15 రోజులు పూర్తి చేసుకున్న సైయారా .. బాక్సాఫీస్ వద్ద అదే దూకుడిని కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో సైయారా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 16వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాలు పరిశీలిస్తే..
ఈ చిత్రంలో గీతా అగర్వాల్ శర్మ, రాజేష్ కుమార్, వరుణ్ బడోలా, షాద్ రంధావా, ఆలం ఖాన్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ, మిథున్ శర్మ, సచతె టాండడన్, పరంపర థాకూర్ స్వరాలు అందించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా పనిచేశారు.

సైయారా బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి సైయారా సినిమాను దాదాపు 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. పాటలు, టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగిన విధంగానే ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేశారు. ఈ అంచనాల నేపథ్యలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8000 స్క్రీన్లలో సైయారా రిలీజ్ అయింది. అయితే రోజు రోజుకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో సైయారాను 10000 స్క్రీన్లకు పెంచారు. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 60 కోట్ల షేర్.. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు విలువ కట్టాయి.
సైయారా 15 రోజుల కలెక్షన్స్ ఎంత?
సైయారా కలెక్షన్లలోకి వెళితే.. ఇండియా వైడ్‌గా తొలి రోజు 22 కోట్లు రూపాయలు, 2వ రోజున 26 కోట్లు, 3వ రోజున 36 కోట్ల రూపాయలు, 4వ రోజున 24 కోట్ల రూపాయలు, 5వ రోజున 25 కోట్ల రూపాయలు, 6వ రోజున 22 కోట్ల రూపాయలు, 7వ రోజున 19 కోట్ల రూపాయలు చొప్పున తొలి వారం 173 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారం కూడా అదే దూకుడు కంటిన్యూ చేస్తూ సెకండ్ వీక్ ఇండియా వైడ్‌గా 108 కోట్లు రాబట్టింది. ఇక 15వ రోజున 5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది సైయారా. మొత్తంగా 15 రోజుల వరకు ఇండియా వైడ్ 290 కోట్ల రూపాయల నెట్, 343 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి,.
ఓవర్సీస్‌లో సైయారా కలెక్షన్స్
ఓవర్సీస్ మార్కెట్‌లో సైయారా ఎదురు లేకుండా సాగుతోంది. ఈ సినిమాకు 15 రోజుల వరకు ఓవర్సీస్‌లో 108 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో సైయారా మూవీ.. ఈ ఏడాది ఓవర్సీస్‌లో విడుదలైన భారతీయ సినిమాలలో కలెక్షన్స్ పరంగా 2వ స్థానంలో నిలిచింది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ఎల్ 2: ఎంపురాన్ 142 కోట్ల వసూళ్లతో టాప్ ప్లేస్‌లో నిలవగా.. నిన్న మొన్నటి వరకు విక్కీ కౌశల్ నటించిన ఛావా 101 కోట్లతో రెండో స్థానంలో ఉండేది. తాజాగా దానిని అధిగమించిన సైయారా సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఓవర్సీస్ కలెక్షన్స్‌ను కలుపుకుని సైయారా చిత్రం వరల్డ్ వైడ్‌గా 15 రోజుల వరకు 451 కోట్ల వసూళ్లు సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది.
సైయారా 16వ రోజు కలెక్షన్ ఎంతంటే?
ఇక సైయారా చిత్రం 16వ రోజు వసూళ్లను పరిశీలిస్తే.. వీకెండ్ కావడంతో ఈ చిత్రానికి బుకింగ్స్ భారీగా పెరిగాయి. ఆగస్ట్ 2వ తేదీన ఓవరాల్‌గా 31 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. దీంతో 16వ రోజున సైయారాకు 7 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో సైయారా చిత్రం ఇప్పటి వరకు 458 కోట్ల రూపాయలు ఆర్జించి నిర్మాతలకు భారీ లాభాలను అందించింది. ఆదివారం సైయారాకు కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











