Saiyaara Day 18 Collection: 500 కోట్ల కలెక్షన్ల దిశగా సైయారా.. బాక్సాఫీస్ వద్ద మోహిత్ సూరి సంచలనం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు అహాన్ పాండే హీరోగా నటించిన తొలి చిత్రం సైయారా. మోహిత్ సూరి దర్శకత్వం వహించగా.. అనీత్ పడ్డా హీరోయిన్‌గా నటించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అక్షయ్ విధాని ఈ సినిమాకు నిర్మాణం వహించగా.. ఆదిత్య చోప్రా సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 18న సైయారా చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో సైయారా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 18వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాలు పరిశీలిస్తే..

సైయారాలో గీతా అగర్వాల్ శర్మ, రాజేష్ కుమార్, వరుణ్ బడోలా, షాద్ రంధావా, ఆలం ఖాన్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ, మిథున్ శర్మ, సచతె టాండడన్, పరంపర థాకూర్ స్వరాలు అందించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా పనిచేశారు.

Saiyaara Day 18 Box Office Collection Worldwide Mohit Suri Movie heading towards 500 crores club

సైయారా బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార వ్యయంతో కలిపి సైయారా సినిమాను దాదాపు 60 కోట్ల బడ్జెట్ అయ్యింది. పాటలు, టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాల నేపథ్యలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8000 స్క్రీన్లలో సైయారాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల షేర్.. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.

సైయారా 17 రోజుల కలెక్షన్స్ ఎంత?
సైయారా కలెక్షన్లలోకి వెళితే.. ఇండియా వైడ్‌గా తొలి రోజు 22 కోట్లు రూపాయలు, 2వ రోజున 26 కోట్లు, 3వ రోజున 36 కోట్ల రూపాయలు, 4వ రోజున 24 కోట్ల రూపాయలు, 5వ రోజున 25 కోట్ల రూపాయలు, 6వ రోజున 22 కోట్ల రూపాయలు, 7వ రోజున 19 కోట్ల రూపాయలు చొప్పున తొలి వారం 173 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారం ఇండియా వైడ్‌గా 108 కోట్లు రాబట్టింది. ఇక 15వ రోజున 5 కోట్ల రూపాయలు, 16వ రోజున 7 కోట్ల రూపాయలు, 17వ రోజున 8 కోట్ల రూపాయలు, 18వ రోజున 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది సైయారా. దీంతో కలుపుకుని సైయారా చిత్రం ఇండియాలో 300 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ మార్క్‌ని అందుకుంది. మొత్తంగా 18 రోజుల వరకు ఈ సినిమా ఇండియా వైడ్ 305 కోట్ల రూపాయల నెట్, 363 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లో సైయారా కలెక్షన్స్
ఓవర్సీస్ మార్కెట్‌లో సైయారా ఎదురు లేకుండా సాగుతోంది. ప్రేమకథతో పాటు పాటలకు ఎన్ఆర్ఐ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఫస్ట్ వీకెండ్‌లో 18 కోట్ల రూపాయలు, సెకండ్ వీకెండ్‌‌‌లో 77 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన సైయారా చిత్రం ఓవర్సీస్‌లో స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తోంది. 18 రోజుల వరకు మోహిత్ సూరి సినిమా ఓవర్సీస్‌లో 114 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌ కలెక్షన్స్‌తో కలిపి సైయారా చిత్రం వరల్డ్ వైడ్‌గా 18 రోజుల వరకు 477 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

సైయారా 18వ రోజు కలెక్షన్ ఎంతంటే?
ఇక సైయారా చిత్రం 18వ రోజు వసూళ్లను పరిశీలిస్తే.. వీకెండ్‌లో కలెక్షన్ష వర్షం కురిపించిన ఈ ప్రేమకథ వర్కింగ్ డేస్‌లో కాస్త స్లో అయ్యింది. సోమవారం ఈ చిత్రం ఇండియా వైడ్‌గా 3 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది. దాంతో కలిపి సైయారా చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.480 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ఆర్జించి నిర్మాతలకు భారీ లాభాలను అందించింది. ఇదే దూకుడు కొనసాగిస్తే సైయారా చిత్రం ఈ వారంలోనే 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: Saiyaara Ahaan Panday Aneet Padda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X