Saiyaara Day 2 Box Office : సైయారా 2వ రోజు బాక్సాఫీస్ జాతర.. ఎన్ని కోట్లు వసూలైందంటే?
బాలీవుడ్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ ఫిల్మ్ సైయారా. డ్రామా మ్యూజికల్ రొమాంటిక్ ఫిల్మ్ గా ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంది. ఆషికీ 2 చిత్రం దర్శకుడు డైరెక్టర్ మోహిత్ సూరి డైరెక్ట్ చేయడం విశేషం. అనన్య పాండే సోదరుడు ఆహాన్ పాండే, సలాం వెంకీ ఫేమ్ అనీత్ పడ్డా జంటగా నటించారు. ఆదిత్యా చోప్రా సమర్పించగా అక్షయ్ విధాని నిర్మాతగా వ్యవహరించారు. తొలిరోజు ఈచిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలో సైయారా మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 2వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఎన్ని కోట్లు అనే వివరాల్లోకి వెళితే..
సైయారా మూవీ బడ్జెట్ ఎంత?
బాలీవుడ్ చిత్రం సైయారా చిత్రానికి యంగ్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించినా, మిగితా పాత్రల్లో స్టార్ నటీనటులు నటించారు. మరోవైపు ఈ సినిమాకు బాలీవుడ్ లోని ప్రముఖ సంగీత దర్శకులు పనిచేయడం విశేషం. మరోవైపు కథకు తగ్గట్టుగా లోకేషన్లు, కీలక సన్నివేశాల చిత్రీకరణకు భారీగా ఖర్చు చేశారు. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ ఖర్చులు కలుపుకొని ఈ చిత్రానికి ర.60 కోట్లకు పైగా ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

సైయారా మూవీ బ్రేక్ ఈవెన్?
సైయారా చిత్రం ప్రధానంగా మ్యూజికల్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ యాక్టర్స్ లీడ్ రోల్స్ లో నటిచడం, ఆషికీ2 డైరెక్టర్ దర్శకత్వం వహించడం, బాలీవుడ్ స్టార్స్ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేయడం, రిలీజ్ కు ముందే సాంగ్స్ పాపులర్ కావడంతో సినిమాకు మంచి బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా 2500 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే మాత్రం థియేట్రికల్ రన్ ద్వారా రూ.120 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
సైయారా 2వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్..
రొమాంటిక్ అండ్ మ్యూజికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. 1వ రోజు ఇండియా నెట్ రూ.21 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.25 కోట్లు, ఓవర్సీస్ రూ.3.5 కోట్లు వసూళ్లు చేసింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని రూ.28.5 కోట్ల గ్రాస్ వసూల్ చేయడం విశేషంగా మారింది. ఇక 2వ రోజు ఈ చిత్రానికి సాయంత్రం వరకు రూ.10 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ అయ్యిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తంగా రూ.20 కోట్ల వరకు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. రెండు రోజుల్లో కలిపి రూ.50 కోట్ల వరకు వసూల్ చేయడం విశేషం.
సైయారా సినిమా సెన్సేషన్..
2025 లో హిందీలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాలకంటే సైయారా తొలిరోజు ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఛావా రూ.29 కోట్లు, సికందర్ రూ.25 కోట్లు, హౌస్‌ఫుల్ 5 రూ.21 కోట్లు వసూల్ చేసింది. ఇక రెండవ స్థానంలో సైయారా చిత్రం నిలవడం విశేషం. ఇక ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు చేస్తుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











