Saiyaara Day 21 Collection: రికార్డ్ కలెక్షన్లతో సైయారా జైత్రయాత్ర.. అహాన్ పాండే మూవీకి ఎన్ని కోట్లంటే?

మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన చిత్రం సైయారా. ప్రపంచవ్యాప్తంగా జూలై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అక్షయ్ విధాని ఈ సినిమాకు నిర్మాణం వహించగా.. ఆదిత్య చోప్రా సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సైయారా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 21వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాలు పరిశీలిస్తే..

సైయారాలో గీతా అగర్వాల్ శర్మ, రాజేష్ కుమార్, వరుణ్ బడోలా, షాద్ రంధావా, ఆలం ఖాన్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ, మిథున్ శర్మ, సచతె టాండడన్, పరంపర థాకూర్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా పనిచేశారు.

Saiyaara Day 21 Box Office Collection Worldwide Mohit Suri s Movie broken all previous records

సైయారా బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార వ్యయంతో కలిపి సైయారా సినిమాను దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల రూపాయల షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. భారీ అంచనాల నేపథ్యలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8000 స్క్రీన్లలో సైయారాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

సైయారా 20 రోజుల కలెక్షన్స్ ఎంత?
సైయారా కలెక్షన్లలోకి వెళితే.. ఇండియా వైడ్‌గా తొలి రోజు 22 కోట్లు రూపాయలు, 2వ రోజున 26 కోట్లు, 3వ రోజున 36 కోట్ల రూపాయలు, 4వ రోజున 24 కోట్ల రూపాయలు, 5వ రోజున 25 కోట్ల రూపాయలు, 6వ రోజున 22 కోట్ల రూపాయలు, 7వ రోజున 19 కోట్ల రూపాయలు చొప్పున తొలి వారం 173 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారం ఇండియా వైడ్‌గా 108 కోట్లు రాబట్టింది. ఇక 15వ రోజున 5 కోట్ల రూపాయలు, 16వ రోజున 7 కోట్ల రూపాయలు, 17వ రోజున 8 కోట్ల రూపాయలు, 18వ రోజున 3 కోట్ల రూపాయలు, 19వ రోజున 3 కోట్ల రూపాయలు, 20వ రోజున 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది సైయారా. దీంతో కలుపుకుని సైయారా చిత్రం ఇండియాలో 309 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది. మొత్తంగా 20 రోజుల వరకు సైయారా మూవీ ఇండియా వైడ్ 309 కోట్ల రూపాయల నెట్, 369 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లో సైయారా కలెక్షన్స్
మోహిత్ సూరి టేకింగ్‌కు అనీత్, అహన్ పాండేల నటనకు ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ఘన విజయంలో ఓవర్సీస్ మార్కెట్ కూడా కీలకపాత్ర పోషించింది. ఇప్పటి వరకు మోహిత్ సూరి సినిమా ఓవర్సీస్‌లో 140 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ వసూళ్లకు ఓవర్సీస్‌ కలెక్షన్స్ కలిపి సైయారా చిత్రం వరల్డ్ వైడ్‌గా 20 రోజుల వరకు 509 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

సైయారా 21వ రోజు కలెక్షన్ ఎంతంటే?
ఇక సైయారా చిత్రం 21వ రోజు వసూళ్లను పరిశీలిస్తే.. వర్కింగ్ డేస్‌లోనూ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గురువారం ఈ చిత్రం ఇండియా వైడ్‌గా 2 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో కలిపి సైయారా చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ.511 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. వచ్చే వారం వరకు ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో సైయారా జైత్రయాత్రకు ఎదురుండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు సైయారా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Read more about: Saiyaara Ahaan Panday Aneet Padda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X