Saiyaara Day 23 Collection: కనక వర్షం కురిపిస్తోన్న సైయారా... భారీ వసూళ్లతో అహన్ పాండే మూవీ రికార్డ్!
చిన్న సినిమాగా విడుదలై రికార్డు కలెక్షన్స్‌తో బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది సైయారా. స్టార్ల సినిమాల రికార్డులను ఒక్కొక్కటిగా బద్ధలు కొడుతూ దుమ్మురేపుతోంది ఈ సినిమా. దాదాపు 20 రోజులు కావొస్తున్నప్పటికీ ఏమాత్రం ఊపు తగ్గడం లేదు. మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా సైయారా చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా జూలై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అక్షయ్ విధాని ఈ సినిమాకు నిర్మాణం వహించగా.. ఆదిత్య చోప్రా సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సైయారా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 23వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాలు పరిశీలిస్తే..
సైయారాలో గీతా అగర్వాల్ శర్మ, రాజేష్ కుమార్, వరుణ్ బడోలా, షాద్ రంధావా, ఆలం ఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ, మిథున్ శర్మ, సచతె టాండడన్, పరంపర థాకూర్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా పనిచేశారు.

సైయారా బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సైయారా చిత్రానికి దాదాపు 60 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల రూపాయల షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ కట్టాయి. టీజర్, ట్రైలర్, పాటలతో హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా దాదాపు 8000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
సైయారా 22 రోజుల కలెక్షన్స్ ఎంత?
సైయారా కలెక్షన్లలోకి వెళితే.. ఇండియా వైడ్‌గా తొలి రోజు 22 కోట్లు రూపాయలు, 2వ రోజున 26 కోట్లు, 3వ రోజున 36 కోట్ల రూపాయలు, 4వ రోజున 24 కోట్ల రూపాయలు, 5వ రోజున 25 కోట్ల రూపాయలు, 6వ రోజున 22 కోట్ల రూపాయలు, 7వ రోజున 19 కోట్ల రూపాయలు చొప్పున తొలి వారం 173 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారం ఇండియా వైడ్‌గా 108 కోట్లు రాబట్టింది. ఇక 15వ రోజున 5 కోట్ల రూపాయలు, 16వ రోజున 7 కోట్ల రూపాయలు, 17వ రోజున 9 కోట్ల రూపాయలు, 18వ రోజున 3 కోట్ల రూపాయలు, 19వ రోజున 3 కోట్ల రూపాయలు, 20వ రోజున 3 కోట్ల రూపాయలు, 21వ రోజున 3 కోట్ల రూపాయలు, 22వ రోజున 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది సైయారా. దీంతో కలుపుకుని సైయారా చిత్రం 22 రోజుల వరకు ఇండియాలో 317 కోట్ల రూపాయల నెట్, 376 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఓవర్సీస్‌లో సైయారా కలెక్షన్స్
ఓవర్సీస్‌లో సైయారా సినిమాకు ఏమాత్రం ఊపు తగ్గడం లేదు. ఇండియాలో వచ్చిన కలెక్షన్స్‌కు సమానంగా ఫారిన్‌లోనూ ఈ ప్రేమ కథకు బ్రహ్మారథం పడుతున్నారు ప్రేక్షకులు. నార్త్ అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూకేలలో వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. 22 రోజుల వరకు ఓవర్సీస్‌లో సైయారాకు 145 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి సైయారాకు వరల్డ్ వైడ్‌గా 521 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
సైయారా 23వ రోజు కలెక్షన్ ఎంతంటే?
వర్కింగ్ డేస్‌లోనే ప్రభంజనం సృష్టిస్తోన్న సైయారా చిత్రం.. వీకెండ్ వచ్చిందంటే మాత్రం దంచికొడుతోంది. శనివారం ఇండియాలోని ప్రధాన నగరాల్లో సాలీడ్ బుకింగ్స్ జరిగినట్లుగా సాక్‌నిక్ తెలిపింది. హిందీలోనూ పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో సైయారా స్వైర విహారం చేస్తోంది. 23వ రోజున ఓవరాల్‌గా 25 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. శనివారం సైయారా చిత్రం ఇండియాలో 4 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది. దీంతో కలిపి మోహిత్ సూరి చిత్రం వరల్డ్ వైడ్‌గా 23 రోజుల వరకు 525 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి 600 కోట్ల మార్క్ వరకు వడివడిగా పరుగులు తీస్తోంది. మరో 18 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తే.. రణబీర్ కపూర్ నటించిన సంజూ (541.76 కోట్ల రూపాయలు) మూవీ రికార్డ్‌ను సైయారా బద్ధలు కొడుతుంది. ఆగస్ట్ 14న వార్ 2, కూలీ చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో 4 రోజుల్లోనే సైయారా తన మార్క్ చూపించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











