Saiyaara Day 25 Collection: సైయారా కలెక్షన్ల సంచలనం.. సల్మాన్, హృతిక్ రికార్డులు బ్రేక్.. ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన అందమైన ప్రేమకథ సైయారా. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హిందీ చిత్ర పరిశ్రమలో ఒక్కొక్క రికార్డును బద్ధలు కొడుతూ సంచలనం సృష్టిస్తోంది సైయారా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు అహన్ పాండే హీరోగా, అనీత్ పడ్డా ఇందులో జంటగా నటించగా మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. అక్షయ్ విధాని నిర్మాణ సారథ్యం వహించగా .. నిర్మాత ఆదిత్య చోప్రా సమర్పకుడిగా వ్యవహరించారు. జూలై 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో సైయారా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 25వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాలు పరిశీలిస్తే..

ఇక సైయారాలో గీతా అగర్వాల్ శర్మ, రాజేష్ కుమార్, వరుణ్ బడోలా, షాద్ రంధావా, ఆలం ఖాన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ, మిథున్ శర్మ, సచతె టాండడన్, పరంపర థాకూర్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా పనిచేశారు.

Saiyaara Day 25 Box Office Collection Worldwide Mohit Suri s Movie Breaks war and Bajrangi Bhaijaan Records

సైయారా బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సైయారా చిత్రాన్ని దాదాపు 60 కోట్ల బడ్జెట్‌‌తో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల రూపాయల షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు విలువ నిర్దేశించాయి. సైయారాను వరల్డ్ వైడ్‌గా దాదాపు 8000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

సైయారా 24 రోజుల కలెక్షన్స్ ఎంత?
సైయారా కలెక్షన్లలోకి వెళితే.. ఇండియా వైడ్‌గా తొలి రోజు 22 కోట్లు రూపాయలు, 2వ రోజున 26 కోట్లు, 3వ రోజున 36 కోట్ల రూపాయలు, 4వ రోజున 24 కోట్ల రూపాయలు, 5వ రోజున 25 కోట్ల రూపాయలు, 6వ రోజున 22 కోట్ల రూపాయలు, 7వ రోజున 19 కోట్ల రూపాయలు చొప్పున తొలి వారం 173 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారం ఇండియా వైడ్‌గా 108 కోట్లు రాబట్టింది. ఇక 15వ రోజున 5 కోట్ల రూపాయలు, 16వ రోజున 7 కోట్ల రూపాయలు, 17వ రోజున 9 కోట్ల రూపాయలు, 18వ రోజున 3 కోట్ల రూపాయలు, 19వ రోజున 3 కోట్ల రూపాయలు, 20వ రోజున 3 కోట్ల రూపాయలు, 21వ రోజున 3 కోట్ల రూపాయలు, 22వ రోజున 3 కోట్ల రూపాయలు, 23వ రోజున 4 కోట్ల రూపాయలు, 24వ రోజున 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది సైయారా. దీంతో కలుపుకుని సైయారా చిత్రం 24 రోజుల వరకు ఇండియాలో 322 కోట్ల రూపాయల నెట్, 388 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లో సైయారా కలెక్షన్స్
ఓవర్సీస్‌లో సైయారా ఈరోజుకు కూడా తగ్గడం లేదు. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో ఈ ప్రేమ కథా చిత్రానికి 150 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి సైయారాకు వరల్డ్ వైడ్‌గా 538 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

సైయారా 24వ రోజు కలెక్షన్ ఎంతంటే?
వర్కింగ్ డే కావడంతో సోమవారం సైయారాకు ఇండియాలో నామమాత్రంగా బుకింగ్స్ జరిగాయి. 24వ రోజు ఓవరాల్‌గా 12 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. మార్నింగ్, మ్యాట్నీలకు బుకింగ్స్ డల్‌గా ఉన్నప్పటికీ ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఊపందుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 24వ రోజు సైయారాకు వైడ్‌గా 2 కోట్ల రూపాయల నికర వసూళ్లు వచ్చినట్లుగా సాక్‌నిక్ నివేదించింది. దీంతో కలుపుకుని సైయారాకు 24 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 540 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

ఇప్పటికే బాలీవుడ్ సూపర్‌స్టార్ల రికార్డులను బద్ధలు కొట్టిన సైయారా తాజాగా మరో రెండు సినిమాలను దాటేసింది. హృతిక్ రోషన్ వార్ (319 కోట్ల రూపాయలు), సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ (320 కోట్ల రూపాయలు) కలెక్షన్ల రికార్డులను బద్ధలు కొట్టింది. మరో 2 కోట్ల రూపాయలు సాధిస్తే రణబీర్ కపూర్ నటించిన సంజూ (541.76 కోట్ల రూపాయలు) మూవీ రికార్డ్‌ను సైయారా బద్ధలు కొడుతుంది. ఆగస్ట్ 14న వార్ 2, కూలీ చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో 2 రోజుల్లో సైయారా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: Saiyaara Ahaan Panday Aneet Padda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X