Saiyaara Day 4 Box Office : ఆషికీ 2 డైరెక్టర్ హవా.. సైయారా చిత్రానికి 150 కోట్లు.. 4వ రోజు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ లో విడుదైన సైయారా చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతుండటం విశేషం. కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ గా మారింది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. అహాన్ పాండే, అనీత్ పడ్డా హీరో హీరోయిన్లుగా నటించారు. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్స్ లో రూపుదిద్దుకోగా మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్? 4వ రోజు వరల్డ్ వైడ్ వసూళ్ల విషయానికొస్తే..
సైయారా బడ్జెట్ ఎంత?
అహాన్ పాండేను పరిచయం చేస్తూ వచ్చిన చిత్రం కావడం, పైగా మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా కావడంతో టెక్నీకల్ గానే భారీ ఖర్చు ఉంటుంది. ఇక స్టార్ కాస్ట్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిన చిత్రం కావడంతో కాస్తా కాస్తా భారీగానే అయ్యింది. చిత్రంలోని ప్రతి సీన్ ను గ్రాండ్ గా షూట్ చేసేందుకు నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలుపుకొని రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్?
ఆషీకీ 2, మర్డర్ 2 వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు మోహిత్ కుమర్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం సైయారా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు సినిమాకు బాలీవుడ్ స్టార్స్ ప్రమోషన్ అందించడం విశేషం. ఇక ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే ట్రెండ్ కావడంతో సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. థియేట్రికల్ రన్ ద్వారా 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నిర్ణయించారు.
3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి..
బాలీవుడ్ లో ప్రస్తుతం సైయారా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. ఏకంగా ఈ చిత్రానికి 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.106 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. డే1 రూ.29.25, 2వ రోజు రూ.37.50 కోట్లు, 3వ రోజు రూ.44 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. ఇక సాక్ నిల్క్ గణాంకాల ప్రకారం.. 3 రోజుల్లో ఇండియా నెట్ 83.25 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.99.75 కోట్లు, ఓవర్సీస్ రూ.15.25 కోట్లు వసూల్ చేసింది. ఇండియా + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.115 కోట్లు వసూల్ చేసింది.
4వ రోజు..
సైయారా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ భారీగానే వసూళ్లు అందుకుంది. 4వ రోజు 50 శాతం వరకు థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. దీంతో కేవలం ఇండియా నెట్ రూ.8.5 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక మిగితా వసూళ్లు, ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని 4వ రోజు రూ.25 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. టోటల్ గా రూ.140 కోట్ల వరకు వసూల్ చేయడం విశేషం. ఇక 4 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకొని లాభాల బాటలో పయనిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











