Saiyaara Day 5 Box Office: మహేష్ బాబు మెచ్చిన సైయారా.. 200 కోట్లకు చేరువగా.. 5వ రోజు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆషికి 2 ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సైయారా. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు ఆహాన్ పాండే, సలాం వెంకీ ఫేమ్ అనీత్ పడ్డా జంటగా రూపొందిన ఈ సినిమా పాటలు ఇప్పటికే పాపురల్ అయ్యాయి. ఆదిత్య చోప్రా సమర్పకుడిగా, అక్షయ్ విధాని నిర్మాతగా రూపొందిన ఈ సినిమా జూలై 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది.

సైయారా సినిమాకు ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ,మిథున్ శర్మ, సచతె టాండన్, పరంపర థాకూర్ పాటలు అందించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రఫిని, రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా వ్యవ్యహరించారు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, సన్నివేశాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ మూవీపై భారీ అంచనాలు పెంచేలా చేశాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు చేసిన ట్వీట్ ఈ సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేసింది. గత 5 రోజులుగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన కలెక్షన్ల తుఫాన్ వివరాల్లోకి వెళితే..

Saiyaara Day 5 Box Office

సైయారా మూవీని వీక్షించిన మహేష్ బాబు ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. సైయారా టీమ్‌కు తలవంచి అభినందనలు తెలియజేస్తున్నాను. నిజాయితీగా, అందంగా ఈ సినిమా కథను చెప్పిన విధానం బాగుంది. కథను నడిపించిన విధానం, పాత్రల్లో నటులు జీవించిన విధానం అద్బుతంగా ఉన్నాయి. చాలా సులభంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి జీవించిన ఆహన్ పాండే, అనీత్ పడ్డాకు నా కంగ్రాట్స్. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తే అన్ని రకాలుగా ఆ అర్హత ఉందనిపిస్తుంది అని ట్వీట్ చేశారు. దాంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.

సైయారా సినిమాను యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా, మ్యూజికల్ హిట్‌కు కావాల్సిన హంగులతో రూపొందించారు. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేశారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య 8000 స్క్రీన్లలో థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 60 కోట్ల షేర్.. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది అని చెప్పారు. అయితే ఈ మూవీ రిలీజ్ తర్వాత వసూళ్ల జైత్రయాత్రను సాధించి 4 రోజుల్లోనే లాభాల్లోకి ప్రవేశించింది.

సైయారా సినిమా తొలి రోజు నుంచి రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఈ సినిమా తొలి రోజు 21.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 26 కోట్ల రూపాయలు, మూడో రోజు 35.75 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 24 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 108 కోట్ల రూపాయలు నెట్, 128 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీకి ఓవర్సీస్‌లో కూడా భారీగా స్పందన వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం గత 4 రోజుల్లో 28 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 156 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక 5వ రోజు సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. నార్త్, ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా టికెట్‌ను తక్కువ రేటుకే పీవీఆర్ ఐనాక్స్‌లో విక్రయించాలని నిర్ణయం తీసుకొన్నది. ముంబైలో, ఇతర నగరాల్లో సోమవారం రాత్రి నుంచే 99 రూపాయలుగా నిర్ణయించారు. దాంతో ఈ సినిమా కలెక్షన్లు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా 5వ రోజు 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X