Saiyaara Day 5 Box Office: సల్మాన్ మూవీ రికార్డును బ్రేక్ చేసిన సైయారా.. 6వ రోజు బాక్సాఫీస్ సంచలనం
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆషికి 2 ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సైయారా. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు ఆహాన్ పాండే, సలాం వెంకీ ఫేమ్ అనీత్ పడ్డా జంటగా రూపొందిన ఈ సినిమా పాటలు ఇప్పటికే పాపురల్ అయ్యాయి. ఆదిత్య చోప్రా సమర్పకుడిగా, అక్షయ్ విధాని నిర్మాతగా రూపొందిన ఈ సినిమా జూలై 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. సైయారా మూవీని వీక్షించిన మహేష్ బాబు ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. సైయారా టీమ్‌కు తలవంచి అభినందనలు తెలియజేస్తున్నాను. నిజాయితీగా, అందంగా ఈ సినిమా కథను చెప్పిన విధానం బాగుంది. కథను నడిపించిన విధానం, పాత్రల్లో నటులు జీవించిన విధానం అద్బుతంగా ఉన్నాయి అని కామెంట్ చేశారు.
సైయారా సినిమాకు ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ,మిథున్ శర్మ, సచతె టాండన్, పరంపర థాకూర్ పాటలు అందించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రఫిని, రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా వ్యవ్యహరించారు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, సన్నివేశాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ మూవీపై భారీ అంచనాలు పెంచేలా చేశాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు చేసిన ట్వీట్ ఈ సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేసింది. గత 5 రోజులుగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన కలెక్షన్ల తుఫాన్ వివరాల్లోకి వెళితే..

సైయారా సినిమా ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 21.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 26 కోట్లు, మూడో రోజు 35.75 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 24 కోట్లు, ఐదో రోజు 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 5 రోజుల్లో 132 కోట్లకుపైగా నెట్, 157 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను వసూళ్లను సాధించింది అని సాక్ నిక్ వెల్లడించింది.
ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ ఆదరణ దక్కుతున్నది. కేవలం నార్త్ అమెరికాలోనే కాకుండా యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్, ఇతర దేశాల్లో అత్యధికంగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా ఇప్పటి వరకు 4 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 34.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 5వ రోజుల్లో 166.5 కోట్ల నెట్ వసూళ్లు, 188 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
సైయారా సినిమా బాలీవుడ్‌లో 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు టాప్ కలెక్షన్లు రాబట్టిన 6వ చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ ఏడాది ఛావా 615 కోట్ల రూపాయలు, హౌస్‌ఫుల్ 198 కోట్లు, రైడ్ 2 179 కోట్లు, సితారే జమీన్ పర్ 164 కోట్లు, స్కై ఫోర్స్ 133 కోట్ల రూపాయలు, సైయారా 133 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఈ చిత్రం 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం వారం రోజులుగా స్ట్రాంగ్ కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా బుధవారం సుమారుగా 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో మరో 2 కోట్ల రూపాయలు రాబడుతుందని భావిస్తున్నారు. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల రూపాయలు గ్రాస్ నమోదు చేస్తుంది. దాంతో ఈ సినిమా 205 కోట్లు వసూళ్ల మైలురాయిని దాటుతుంది పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











