Salaar Collections చరిత్ర సృష్టించిన సలార్.. 2 గంటల్లోనే కలెక్షన్ల ఊచకోత.. అడ్వాన్స్ బుకింగ్ ఎన్ని కోట్లంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదలకు ముందే బాక్సాఫీస్ వేటను ప్రారంభించింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది. దేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో విశేషంగా ప్రేక్షకులను థియేటర్‌కు పరుగులు పెట్టేలా చేస్తున్నది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ముందస్తు టికెట్ల అమ్మకాలు మొదలు కాగా, తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టారు. అయితే నైజాంలో ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్:సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు నైజాంలో భారీగా స్పందన లభిస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రస్తుతానికి మొత్తం 153 షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ షోలోకు ఇప్పటికే 90 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. కేవలం రెండు గంటల్లోనే ఈ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రభాస్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సాధించింది.

Salaar Box office Report: Prabhas movie get 2 crores in 2 hours in Hyderabad

బెంగళూరు, చైన్నైలో :ఇక బెంగళూరులో సలార్ మూవీ ప్రభంజనం కొనసాగుతున్నది. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 635 షోలు ప్రదర్శిస్తుండగా.. ప్రస్తుతానికి 50 శాతం అక్యుపెన్సీ నమోదైంది. దాదాపు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక చెన్నైలో ఈ సినిమాకు సంబంధించి 150 షోలు ప్రదర్శిస్తుండగా, 24 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో మొత్తం 20 లక్షల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది.

మల్టీప్లెక్స్ స్క్రీన్లలో :ఇండియాలో మల్టీప్లెక్స్‌లో సలార్ అడ్వాన్స్ బుకింగ్ హవా కొనసాగుతున్నది. నేషనల్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 250000 టికెట్లు అమ్ముడుపోయాయి. పీవీఆర్ ఐనాక్స్ స్క్రీన్లలో 150000 టికెట్లు, సినీ పోలీస్ స్క్రీన్లలో 100000 టికెట్లు అమ్ముడుపోయాయి.

Salaar Box office Report: Prabhas movie get 2 crores in 2 hours in Hyderabad

ఓవర్సీస్‌లో కలెక్షన్లు:సలార్ మూవీ ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను, ఆక్యుపెన్సీని నమోదు చేస్తున్నది. యూకేలో ఈ సినిమా 200కుపైగా లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు. అలాగే మొత్తం 306 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ చిత్రం 24 వేల పౌండ్లు సాధించింది. తెలుగులో 22 వేల పౌండ్లు, హిందీ వెర్షన్ 1500 పౌండ్లు, ఇతర వెర్షన్లకు 500 పౌండ్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. అమెరికాలో 1 మిలియన్ డాలర్లకు చేరువైంది. గల్ఫ్‌ కంట్రీస్‌లో 200k, యూకే 100K డాలర్లు వసూలు చేసింది.

Salaar Box office Report: Prabhas movie get 2 crores in 2 hours in Hyderabad

ఓవరాల్‌గా కలెక్షన్లు:ప్రస్తుతం సలార్ అడ్వాన్స్ బుకింగ్ జోరు చూస్తే ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల షేర్ వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్తరాదిలో డంకీ సినిమాను మించి సలార్ అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X