Salaar Vs Dunki Collections: షారుఖ్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు పైచేయి సాధించారో తెలుసా?

థియేటర్లలో పెద్ద సినిమాలు నడుస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్లు అయినటు వంటి ప్రభాస్, షారుఖ్ ఖాన్ నటించిన సలార్, డంకీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. ఇప్పటికే ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాకు పోటీగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్ దిగింది. ఇక బాక్సాఫీస్ బరిలో ఎవరు విజయం సాధించారు.. ఎవరు పై చేయి సాధించారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఇక శృతి హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రేయ రెడ్డి, ఝాన్సీ వంటి పలువరు స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మంచి రివ్యూలు అయితే వచ్చాయి. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.178 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

Recommended Video

Dunki వల్ల ఆ ఆల్ టైమ్ రికార్డు Salaar కి తృటిలో మిస్ Prabhas Vs Shahrukh Khan | Filmibeat Telugu

Salaar Collections Vs Dunki Collections: Shah Rukh Khan and Prabhas who will win at the box office?

ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీ బెల్టులో షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాకు పోటీగా దిగింది. షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జవాన్, పఠాన్ వంటి సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే డంకీ మాత్రం కేవలం హిందీలో రిలీజ్ అయింది. పాన్ ఇండియా సినిమాగా దీనిని రిలీజ్ చేయలేదు. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

అయితే హిందీ బెల్టులో డంకీ వర్సెస్ సలార్ వార్ సాగుతోంది. అయితే సలార్ హిందీలో రూ.75 కోట్ల బిజినెస్ చేసుకుంది. అంటే ఈ సినిమా హిందీలో హిట్ అవ్వాలంటే... 75 కోట్ల రూపాయలు రాబట్టాలి. ఇక షారుఖ్ ఖాన్ నటించిన డంకీ విషయానికి వస్తే... ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ చేసుకుంది. అంటే 200 కోట్లకు పైగా వసూలు చేయాలన్నమాట.

Salaar Collections Vs Dunki Collections: Shah Rukh Khan and Prabhas who will win at the box office?

ఇక డంకీ వర్సెస్ సలార్ కలెక్షన్స్ ఒకసారి చూస్తే... 'డంకీ' మూవీకి ఇండియాలో రూ. 40 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే.. ఇండియాలో 20 కోట్ల రూపాయలు రాగా.. ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక సలార్ విషయానికి వస్తే.. హిందీలో ఈ మూవీ 25 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ మూవీ రూ.178 కోట్లు వసూలు చేసింది.

బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద స్టార్ హీరోలు పోటీపడినప్పటికీ.. హిందీలో స్టార్ మార్కెట్ ఉన్న హీరో సినిమాను ప్రభాస్ సలార్ తొక్కేందనే చెప్పాలి. రెండో రోజుకే సలార్ దెబ్బకు డంకీ వసూళ్లు తగ్గిపోయాయి. ఇక ఇలాగే కొనసాగితే.. సలార్ దెబ్బకు డంకీ కి భారీ నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X