Salaar Day 1 Box Office Report హైదరాబాద్‌లో రికార్డు కలెక్షన్లు.. వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద గ్రాండ్‌గా మొదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్ల నమోదుకు రంగం సిద్దమైంది. గత నాలుగు రోజులుగా కొనసాగిన అడ్వాన్స్ బుకింగ్‌కు ఊహించని రెస్సాన్స్ వచ్చింది. అయితే హైదరాబాద్‌లోనే కాకుండా ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందనే విషయంలోకి వెళితే..
డంకీ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఐనాక్స్, పీవీఆర్, మిరాజ్ థియేటర్లను బ్లాక్ చేయడంతో సలార్‌కు నార్త్‌లో స్క్రీన్లు లభించలేదు. దాంతో పెద్ద గొడవ జరిగింది. హిందీ రాష్ట్రాల్లో సలార్‌కు స్క్రీన్లు ఇవ్వకుండా బ్లాక్ చేయడం భారీ వివాదానికి దారి తీసింది.

ప్రభాస్‌కు ఎలాగైనా హిట్టు పడాలనే దశలో వస్తున్న సమయంలో సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన వ్యక్తమైంది. తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన 2 లక్షల టికెట్లు, మలయాళంలో ఈ సినిమా 1.5 లక్షల టికెట్లు, తమిళంలో 1.25 లక్షలు, కన్నడలో 1 లక్ష, తెలుగు ఐమాక్స్ వెర్షన్ 5 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. హిందీలో 2 లక్షల టికెట్లు అమ్మడుపోయాయి.
సలార్ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. అత్యధికంగా హైదరాబాద్‌లో 91వ శాతం, పాండిచ్చెరిలో 100 శాతం, త్రివేండ్రంలో 80 శాతం, మధురైలో 77 శాతం, వరంగల్‌లో 91వ శాతం, విజయవాడలో 92 శాతం, ముంబైలో 50 శాతం, పూణెలో 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇక తాజా సమాచారం ప్రకారం.. సలార్ మూవీ తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా దాదాపు 40 కోట్ల షేర్, 45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇందులో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల నుంచే వచ్చాయి. ఇక హైదరాబాద్‌లో 12 కోట్ల రూపాయలు, బెంగళూరులో 8 కోట్ల రూపాయలు, చెన్నైలో 3 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది.

సలార్ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఇండియాలో ఈ సినిమా దాదాపు 70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని 110 నుంచి 120 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











