Salaar Advance Booking Collections రికార్డుస్థాయిలో సలార్ అడ్వాన్స్ బుకింగ్.. ప్రభాస్ మూవీకి కలెక్షన్లు ఎన్ని

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సలార్. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ హోంబలే నిర్మిస్తున్నది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

Recommended Video

Salaar Advance Booking Collection's.. ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపుతున్న సలార్ | Filmibeat Telugu

సలార్ పార్ట్ 1 సీస్‌ఫైర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అవుతున్నది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇంకా పలు దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఉత్తర అమెరికా, యూఏపీ, మిడిల్ ఈస్ట్, యూకేలో మొదలయ్యాయి.

Salaar day 1 Predicted Collections Worldwide: Prabhas movie to cross 100 crores Global Box office

ఇండియాలో నేషనల్ మల్టీప్లెక్ష్ చైన్ థియేటర్లలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పీవీఆర్, ఐనాక్స్ స్క్రీన్లలో 25వ వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఇతర భాషల్లో 10 వేల టికెట్లు, హిందీలో 15 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇండియాలో కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ఇక ఇండియాలో ఉత్తరాది కంటే దక్షిణాది సినిమా పరిశ్రమలో సలార్ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇంకా ఆంధ్రా, తెలంగాణ రాస్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావాల్సి ఉంది. ఒకవేళ పూర్తిస్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైతే భారీగా కలెక్షన్లు నమోదు అవుతాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఓవర్సీస్‌లో సలార్ పార్ట్ 1 సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. అమెరికా, కెనడాలో ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అలాగే యూఏఈ, మిడిల్ ఈస్ట్‌లో 100k డాలరల్ు, యూకేలో 200K పౌండ్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్లు అంటే.. 16 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

Salaar day 1 Predicted Collections Worldwide: Prabhas movie to cross 100 crores Global Box office

సలార్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లో వెళితే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 21 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. ఇక ఈ సినిమా డంకీతో పోటీ పడుతూనే భారీగా కలెక్షన్లు నమోదు చేయడానికి సిద్దమైంది. తొలి రోజు సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X