Salaar Overseas Collections ఓవర్సీస్‌లో సలార్ కలెక్షన్ల ప్రకంపనలు.. బాక్సాఫీస్‌పై ప్రభాస్ కోత ఓ రేంజ్‌లో!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ నెల రోజుల క్రితమే ఓవర్సీస్‌లో మొదలైంది. అయితే రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్ది కలెక్షన్లు ఊపందుకొన్నాయి. డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
Recommended Video

సలార్ మూవీ తొలి రోజే రికార్డు వేగంతో అరుదైన మైలురాళ్లను అధిగమించింది. మొదటి రోజే ఈ సినిమా ఓవర్సీస్‌లో ప్రమాణంగా భావించే 1 మిలియన్ డాలర్ మార్క్‌ను సునాయసంగా అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ల దర్వా 2.6 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ మూవీ.. కరెంట్ బుకింగ్ ద్వారా భారీగా వసూళ్ల గణాంకాలను నమోదు చేసింది.

సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. నార్త్ అమెరికాలో ప్రీమియర్ ప్రదర్శన ముందుకు వరకు 750k డాలర్లు, యూకేలో 150K డాలర్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 100K డాలర్లు, గల్ఫ్‌లో 50K, ఇతర దేశాల్లో 100K వసూళ్లతో కలిపి 1 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్లను అంటే 8.8 కోట్ల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.
ఇక సలార్ ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఉత్తర అమెరికా అంటే యూఎస్, కెనడాలో కలిపి ఈ మూవీ 2.6 మిలియన్ డాలర్లను అంటే 21.6 కోట్ల రూపాయలను వసూలు చేసింది. యూకే, ఐర్లాండ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని 173 లోకేషన్లలో రిలీజ్ చేయగా. 165K పౌండ్స్ అంటే 1.7 కోట్లు, ఆస్ట్రేలియాలో 450K డాలర్లు అంటే 2.29 కోట్లు, గల్ఫ్ దేశాల్లో ఈ మూవీ 3.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో సలార్ ప్రీమియర్స్, తొలి రోజు కలెక్షన్ల వివరాలను చూస్తే.. ఈ సినిమా భారీగానే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా తాజా సమాచారం అందేసరికి 3.6 మిలియన్ డాలర్లు అంటూ 30 కోట్లకుపైగానే కలెక్షన్లను రాబట్టింది. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఉంది.
సలార్ మూవీ ఓవర్సీస్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 75 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా తొలి రోజే 30 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. అయితే తొలివారంలోనే ఈ సినిమా 80 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు స్పస్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











