Salaar Day 2 Collections 300 కోట్ల క్లబ్‌లో సలార్.. వరల్డ్ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ప్రభాస్!

బాహుబలి 2 తర్వాత సరైన హిట్టు కోసం వేచి చూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్‌కు సలార్ మూవీ రూపంలో బ్లాక్ బస్టర్ లభించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను శాసిస్తున్నది. తొలి రోజు 178 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రికార్డును నెలకొల్పింది. అయితే ఈ సినిమా రెండో రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయానికి వస్తే..

సలార్ చిత్రం 270 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా.. 350 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక రిలీజ్‌కు ముందు భారీ అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేయడంతోపాటు అదే జోష్‌ను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా 178.7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డ్ క్రియేట్ అయింది.

salaar day 2 Collections

సలార్ మూవీ రెండో రోజు అదే జోష్‌ను కొనసాగించింది. అయితే తొలి రోజు కంటే 30 శాతం కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. కానీ టాప్ రేంజ్ హీరోల్లో రెండో రోజు సాధించిన వసూళ్లతో పోల్చితే సలార్ 2వ రోజు కలెక్షన్లు ఎక్కువే అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇండియాలో సలార్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ దేశవ్యాప్తంగా 90 కోట్ల రూపాయల షేర్ సాధించింది. తెలుగులో 67 కోట్ల రూపాయలు నికరంగా, మలయాళంలో 4 కోట్లు, తమిళంలో 4 కోట్లు, కర్ణాటకలో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక హిందీలో 16 కోట్లు నికరంగా సాధించింది.

సలార్ మూవీ సినిమా రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోకు 70 శాతం, మ్యాట్నీకి 80 శాతం, ఫస్ట్ షోకు 80 శాతం, సెకండ్ షోకు 80 శాతం కలెక్షన్లు నమోదు అయ్యాయి. మలయాళంలో ఓవరాల్‌గా 40 శాతం, తమిళంలో 35 శాతం, కన్నడలో 60 శాతం, హిందీలో 40 శాతం వసూళ్లు సాధించాయి.

ఇక సలార్ రెండో రోజు కలెక్షన్ల వివారాల్లోకి వెళితే.. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లోకలిపి ఈ చిత్రం 55 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అలాగే హిందీలో ఈ సినిమా 20 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా ఇండియాలో 80 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా కట్టారు.

సలార్ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ప్రభాస్ మూవీ నార్త్ అమెరికాలో 2.6 మిలియన్ డాలర్లు, ప్రపంచవ్యాప్తంగా 3.6 మిలియన్ డాలర్ల వసూళ్లు అంటే 30 కోట్ల రూపాయలు రాబ్టింది. ఇక రెండో రోజు ఈ మూవీ 3 మిలియన్లు వసూలు చేసి మొత్తంగా 6.5 మిలియన్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా సుమారుగా 60 కోట్ల రూపాయలు రాబట్టవచ్చని అంచనా వేశారు.

సలార్ రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా 300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. తొలి రోజు 179 కోట్ల మేర వసూలు చేయగా. రెండో రోజు ఇండియాలో 80 కోట్లు, ఓవర్సీస్‌లో 25 కోట్ల రూపాయలు కలిపితే మొత్తంగా 100 కోట్లకుపైగానే వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు చేరువగా కలెక్షన్లను నమోదు చేస్తుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X