Salaar Box office Report ఓవర్సీస్‌లో 100 కోట్లు.. 5 రోజుల్లో ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 400 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇక తొలివారాంతం తర్వాత భారీగానే వసూళ్లను రాబడుతున్నది. ఉత్తరాదిలో ఈ సినిమా డంకీతో పోటీ పడుతూ భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా ఓవర్సీస్, ఇండియా కలెక్షన్లకు సంబంధించి 5వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..
సలార్ మూవీని సుమారుగా అన్ని వ్యయాలతో కలిపి 400 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ 350 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 5700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. రిలీజ్‌కు ముందు భారీగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు కావడంతో ఈ సినిమా వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి.

ఇండియాలో సలార్ చిత్రం తొలి రోజున ఘనంగా కలెక్షన్లను మొదలుపెట్టింది. ఈ సినిమా తొలి రోజున 91 కోట్ల రూపాయలు, రెండో రోజు 56 కోట్లు, మూడో రోజు 62 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 4 రోజుల్లో 250 కోట్ల షేర్ వసూలు చేసింది.
సలార్ చిత్రం తొలి రోజున రికార్డు వసూళ్లను రాబట్టింది. సుమారుగా 178 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు 90 కోట్ల రూపాయల గ్రాస్, మూడో రోజు 75 కోట్ల గ్రాస్ వసూళ్లు, 4వ రోజు ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా 410 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇదిలా ఉండగా, సలార్ మూవీ ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 11 మిలియన్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. భారతీయ కరెన్సీలో సుమారుగా 100 కోట్లు రూపాయల గ్ాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇంకా భారీగా కలెక్షన్లు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, సలార్ చిత్రం 5వ రోజు కూడా భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో 10 కోట్ల షేర్, ఇండియావైడ్ 20 కోట్లు నికరంగా.. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను నమోదు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 450 కోట్లకు చేరువ కానున్నది.


Click it and Unblock the Notifications











