Salaar USA Collections: పవన్ రికార్డు బ్రేక్ చేసిన ప్రభాస్.. రిలీజ్ ముందే అన్ని కోట్లు ఏంటి సామీ!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎంతో మంది స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అందులో కొందరు మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగి సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. కొంత కాలంగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తోన్న అతడు.. ఇప్పుడు 'సలార్' అనే మూవీతో రాబోతున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమా విడుదలకు సమయం ఉన్నా.. రికార్డులను మాత్రం ఊచకోత కోస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాస్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలను మీరే చూడండి!
సలార్‌గా వస్తున్న ప్రభాస్:ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మూవీనే 'సలార్'. ఈ మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది నటించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇచ్చాడు.

సీజ్‌ఫైర్ రిలీజ్‌కు రెడీగా:క్రేజీ యాక్షన్‌తో రూపొందిన 'సలార్' మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. అందులో మొదటి పార్టును 'సలార్: సీజ్‌ఫైర్' టైటిల్‌తో డిసెంబర్ 22న తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు ట్రైలర్లను, పాటను కూడా విడుదల చేసేసింది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేసి విడుదలకు రెడీగా ఉంచింది.
బుకింగ్స్‌కు రెస్పాన్స్‌తో:ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ రిలీజ్ డిసెంబర్ 22వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన లభిస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే రాబడుతోంది. అలాగే, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ దక్కుతోంది.

అప్పుడే ఆ మార్క్ రీచ్:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. అక్కడ 662 లొకేషన్లలో 2165 షోలకు గానూ అమ్మకాలు ప్రారంభించగా.. ఇప్పటికే 57252 టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే 1.5 మిలియన్ డాలర్ల (12.48 కోట్లు)ను కూడా వసూలు చేసింది.
పవన్ రికార్డు బ్రేక్ చేసి:కొంత కాలంగా ప్రభాస్ సినిమాలకు యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ విడుదలకు రెండు రోజులు సమయం ఉండగానే 1.5 మిలియన్ మార్క్ కూడా క్రాస్ చేసి సత్తా చాటుకుంది. తద్వారా పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' పేరిట ఉన్న 1.52 మిలియన్ డాలర్ల రికార్డును ప్రభాస్ సినిమా బద్దలు కొట్టేసింది.

బాహుబలిని దాటేసేలా:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ యూఎస్‌లో ప్రభంజణమే సృష్టిస్తోంది. ఇప్పుటికే 1.55 మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న ఈ చిత్రం.. రిలీజ్ సమయానికి మరింత రాబట్టే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే 'బాహుబలి 2' పేరిట ఉన్న 2.45 మిలియన్ డాలర్ల మార్కును సైతం దాటేసే అవకాశం ఉంది. మరి ఏం జరగబోతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











