Salaar Collections.. సలార్ కలెక్షన్ల ఊచకోత.. ప్రభాస్ ఊరమాస్ బాక్సాఫీస్ బ్యాటింగ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. తొలి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించింది. కేజీఎఫ్ తర్వాత ఏర్పడిన భారీ అంచనాల మధ్య ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు ఊహించని రెస్పాన్స్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? బిజినెస్ ఎంత జరిగింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సలార్ బడ్జెట్ ఎంతంటే?:సలార్ సినిమా బడ్జెట్ వివరాల్లోకి వెళితే. ఈ సినిమాను సుమారుగా 270 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఇక ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ 150 కోట్ల రూపాయలు, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా మొత్తంగా 400 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Salaar Movie Expected Collections Worldwide: Prabhas movie is rocking Start Box office

సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు:సలార్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ప్రపంచవ్యాప్తంగా రికార్డు ధరకు థియేట్రికల్ రైట్స్‌ అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా, సీడెడ్, నైజాం థియేట్రికల్ హక్కులను 144 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులను 30 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 12 కోట్ల రూపాయలకు, కేరళ థియేట్రికల్ హక్కులు 6 కోట్ల రూపాయలు అమ్మారు.

Salaar Movie Expected Collections Worldwide: Prabhas movie is rocking Start Box office

హిందీ, ఓవర్సీస్‌లో బిజినెస్:ఇక హిందీ, ఇతర రాష్ట్రాల హక్కులు 82 కోట్ల రూపాయల మేర అమ్మడుపోయాయి. ఓవర్సీస్ హక్కులను 75 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 350 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో వచ్చాయి. చాలా రోజుల తర్వాత ప్రభాస్ మూవీ రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సలార్ తొలి రోజు కలెక్షన్ల అంచనా:సలార్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ రికార్డుస్థాయిలో నమోదైంది. దాంతో తొలి రోజు కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద సరికొత్త నంబర్లను నమోదు చేస్తున్నది. ఆంధ్రా, నైజాంలో సుమారుగా 60 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 15 కోట్ల గ్రాస్, కేరళలో 5 కోట్ల గ్రాస్, తమిళనాడులో 10 కోట్ల గ్రాస్, ఉత్తరాదిలో 30 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో 130 కోట్ల గ్రాస్, 110 కోట్ల నికర కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్క కట్టారు.

Salaar Movie Expected Collections Worldwide: Prabhas movie is rocking Start Box office

సలార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లంటే? :ఇక సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఉత్తర అమెరికాలో 2.5 మిలియన్ డాలర్లు, ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్ డాలర్లు అంటే.. 50 కోట్ల మేర వసూళ్లను సాధించ వచ్చని అంచనా వేశారు. ఈ సినిమా ఓవరాల్‌గా 175 కోట్ల నుంచి 200 కోట్ల మేర కలెక్షన్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X