Salaar Ticket Bookings: చరిత్ర తిరగరాసిన ప్రభాస్.. ఇండియాలోనే టాప్ మూవీగా సలార్ రికార్డు
సలార్.. సలార్.. సలార్... కొద్ది రోజులుగా ఇండియా వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఇది ఒకటి. అంతలా రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ క్రేజీ యాక్షన్ సినిమా దేశం మొత్తం ప్రభావాన్ని చూపించే విధంగా విడుదలకు ముందు నుంచే దూసుకుపోతోంది. అలా భారీ హైప్‌తో ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'సలార్' మూవీ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఫలితంగా దేశంలోనే టాప్ ప్లేస్‌కు చేరింది. ఆ వివరాలను మీరే చూడండి!
సలార్‌గా ఎంటరైన ప్రభాస్:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమానే 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా సందడి:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీంతో రాత్రి 1 గంట నుంచే థియేటర్లు ప్రేక్షకుల రాకతో కళకళలాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 7 గంటలకే షోలు పడ్డాయి. దీంతో ఈ మూవీ సందడి ఓ రేంజ్‌లో కనిపిస్తోంది.
అలాంటి టాక్... భారీగానే:రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ 'సలార్: సీజ్‌ఫైర్' షోలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పడిపోయాయి. అంతటా దీనికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి టాక్ కూడా మంచిగా లభించింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

30 లక్షలు దాటిన టికెట్లు:పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అందుకే ఈ సినిమాను మొదటి రోజు చూడాలని భావించారు. ఇందుకోసం అడ్వాన్స్ బుకింగ్స్ కోసం పోటీ పడ్డారు. ఫలితంగా ప్రభాస్ సినిమా మొదటి రోజుకు సంబంధించి ఏకంగా 30 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.
ఎక్కడ ఎన్ని టికెట్లంటే:'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి సంబంధించి మొదటి రోజుకు గానూ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 13.25 లక్షల టికెట్లు అమ్ముపోయాయి. అలాగే, తెలంగాణలో 6 లక్షలు, నార్త్ ఇండియాలో 5.25 లక్షలు, కర్నాటకలో 3.25, కేరళలో 1.50 లక్షలు, తమిళనాడులో 1 లక్ష టికెట్లు సేల్ అయ్యాయి. ఇలా ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం 30.25 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి.

ఈ ఏడాడి టాప్ మూవీగా:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ మొదటి రోజుకు సంబంధించి తాజాగా 30.25 లక్షల టికెట్లు (3.02 మిలియన్లు) అమ్మడయ్యాయి. దీంతో ఈ ఏడాది అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకున్న చిత్రంగా ఇది చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే 'లియో' మూవీ పేరిట ఉన్న 2.45 మిలియన్ల రికార్డును బ్రేక్ చేసేసింది. వీటి తర్వాత జవాన్, యానిమల్, పఠాన్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











